‘బీజేపీలో చేరడం లేదు.. అసత్య ప్రసారాలు మానుకోండి’

by Shyam |
MP-Bibi-Patil
X

దిశ, నారాయణఖేడ్: తాను టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నానని వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ తెలిపారు. గురువారం నారాయణఖేడ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని మీడియా చానళ్లు, పేపర్లు, యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని వారికి లీగల్ నోటీసులు పంపిస్తామని హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం జరుగుతుందని చెప్పారు. సీఎం కేసీఆర్, తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలతో సమన్వయంతో పనిచేస్తూ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీలో ఎవరితోనూ విభేదాలు లేవని, ఎమ్మెల్యేలందరితో సమన్వయంతో పనిచేస్తున్నానని తెలిపారు. అసత్య ప్రసారాలను ఎవరూ నమ్మవద్దని చెప్పారు.

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూరు మండలం బోరంచ గ్రామం వద్ద బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ పథకం సర్వే ప్రారంభ స్థలాన్ని గురువారం జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిలు పరిశీలించారు. ఈ నెల 21న తెలంగాణ రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు బసవేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులు ప్రారంభం చేయనున్నట్టు వారు తెలిపారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా ఒక లక్షా 31 వెయ్యి ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని తెలిపారు. కాలేశ్వరం ద్వారా సాగునీటిని రైతులకు అందించేందుకు సీఎం కేసీఆర్ భగీరథ ప్రయత్నం చేస్తున్నారని కొనియాడారు.

Advertisement

Next Story

Most Viewed