- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Alekhya: తారకరత్న భార్య బర్త్‌డేని సెలెబ్రేట్ చేసిన వైఎస్ షర్మిల.. ఎమోషనల్ అయిన అలేఖ్య(పోస్ట్)

దిశ, సినిమా: నందమూరి తారకరత్న భార్య గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. నటుడు తారకరత్న ఆకస్మిక మరణం అందరినీ కలచివేసింది. ముఖ్యంగా పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న అలేఖ్య బాధ వర్ణనాతీతం. ఆయన మరణం తర్వాత అలేఖ్య కోలుకోవడానికి చాలా రోజులే పట్టిందని చెప్పాలి. ఇక తారకరత్న ప్రేమ వివాహాన్ని అంగీకరించిన నందమూరి ఫ్యామిలీ, తారక్‌ను దూరం పెట్టిన విషయం తెలిసిందే. అప్పుడప్పుడే కుటుంబానికి దగ్గరవుతున్నాను అని సంతోషపడిన తారక్ ఆకస్మికంగా మరణించిన విషయం తెలిసిందే. అలా అతను చనిపోయిన తర్వాత ఈమె సోషల్ మీడియాలో ఎప్పుడూ తన భర్త తారకరత్న జ్ఞాపకాలు, పిల్లల ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.
ఈ క్రమంలో తాజాగా అలేఖ్య తన పుట్టినరోజు సెలబ్రేషన్స్ వీడియోని షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. వైఎస్ షర్మిల దగ్గరుండి మరీ బర్త్ డేని సెలబ్రేట్ చేస్తూ అలేఖ్య చేత కేక్ కట్ చేయించింది. దీంతో అలేఖ్య ఎమోషనల్ అవ్వగా షర్మిల దగ్గరకు తీసుకొని హత్తుకున్న ఈ వీడియోను షేర్ చేస్తూ అలేఖ్య.. “గత కొన్నేళ్లుగా నా పక్కన ఉంటావు అని చేసిన ప్రామిస్‌ని నువ్వు నిలబెట్టుకుంటున్నావు అక్క. నా కోసం టైం ఇచ్చి.. నా బర్త్ డే ని సెలబ్రేట్ చేసినందుకు ధన్యవాదాలు. నాకు కన్నీళ్లు వస్తున్నాయి. నువ్వు చేసే చిన్న పని కూడా నాకు బ్లెస్సింగ్ లా అనిపిస్తుంది. నువ్వు నాకెంత స్పెషల్ అనేది నేను చెప్పలేను. నీ స్థానాన్ని ఎవరూ రీప్లేస్ చేయలేరు అక్క. లవ్ యు షర్మిల అక్క” అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
(video link credits to alekhya tarakratna instagram id)