నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న యంగ్ బ్యూటీ.. అలాంటి సీన్స్‌లో నటించాలంటే ఆ పని చేయాల్సిందేనంటూ కండీషన్!

by Disha Web Desk 6 |
నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న యంగ్ బ్యూటీ.. అలాంటి సీన్స్‌లో నటించాలంటే ఆ పని చేయాల్సిందేనంటూ కండీషన్!
X

దిశ, సినిమా: కన్నడ బ్యూటీ పాయల్ రాధాకృష్ణ మొదట మోడలింగ్ చేసి నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చింది. పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. పాయల్ కన్నడలోనే కాకుండా తమిళంలోనూ నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు ‘ప్రసన్న వదనం’ సినిమాతో టాలీవుడ్‌ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుంది. ఇందులో హీరోగా సుహాస్ నటిస్తుండగా.. అర్జున్ వైకే దర్శకత్వం వహిస్తున్నాడు. దీనికి మణికంఠ, ప్రసాద్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఈ మూవీ మే 3 థియేటర్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో.. ఇందులో హీరోయిన్‌గా నటించిన పాయల్ రాధాకృష్ణ నిర్మాతలకు కొన్ని సీన్స్ చేయాలంటే కండీషన్ పెట్టినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. పెంపుడు జంతువులు అంటే నాకు ఇష్టం లేదు. కాబట్టి జంతువులతో సీన్స్ చేయాలంటే నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది.

అయినా నటించాలంటే మాత్రం తప్పనిసరిగా ఎక్స్ట్రా రెమ్యునరేషన్ ఇవ్వాలని నిర్మాతలకు కండీషన్ పెడుతుందట. లేదంటే నటించనని ఖరాకండీగా చెప్పేస్తుందట. సినిమా కోసం నిర్మాతలు కూడా ఈ అమ్మడు అడిగినంత ఇస్తున్నారని టాక్. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఇదేం వింత కండీషన్ అంటూ నవ్వుకుంటున్నారు.



Next Story

Most Viewed