ఆస్తులన్నీ అమ్మేసి రెండో పెళ్లి చేసుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ భార్య?

by samatah |   ( Updated:2023-04-01 07:00:31.0  )
ఆస్తులన్నీ అమ్మేసి రెండో పెళ్లి చేసుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ భార్య?
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు చక్రి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఆయన అకాల మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరనిలోటు. అయితే ఆయన భౌతికంగా దూరమై 8 సంవత్సరాలు గడిచిపోతున్నా ప్రేక్షకుల మనసులో ఇంకా నిలిచే ఉన్నాడు అనడంలో అతిశయోక్తిలేదు. అయితే చక్రి చనిపోయిన తర్వాత తమ కుటుంబంలో చాలా గొడవలు జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వారి ఫ్యామిలీ నుంచి ఏ ఒక్కరూ మీడియా ముందుకు రాలేదు. కాగా, తాజాగా చక్రి తమ్ముడు మహిత్ తమ అభిమానులతో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

చక్రి మరణాంతరం జరిగిన గొడవలపై చక్రి తమ్ముడు స్పందించాడు. ఆయన మాట్లాడుతూ..అన్నయ్య ఉన్నప్పుడు మాకు ఎలాంటి ఇబ్బందుదలు లేవు. ఆయన చనిపోయాక ఆస్తి గొడవలు మొదలయ్యాయి. అవి కాస్త మా వదిన వలన మీడియా వరకు వచ్చాయి. అన్నయ్య ఆస్తుల్లో కొన్నింటిని ఆయన భార్య అమ్మేసి అమెరికాకు వెళ్లింది. అక్కడే మరో పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు. ప్రస్తుతం మాకు ఆమెతో ఎలాంటి సంబంధాల్లేవు. అన్నయ్య లేడనే బాధకన్నా ఆస్తుల గొడవు ఎక్కువ అవ్వడం చాలా బాధ అనిపించింది. కొన్ని రోజులు నరకంగా గడిచాయి. కానీ ఆ తర్వాత సమస్యలన్నీ ఒక్కొక్కటిగా సద్దు మణుగుతూ వచ్చాయి. ఇప్పటికీ కొన్ని ఆస్తులకు సంబంధించిన కేసులు ఇంకా కోర్టులోనే ఉన్నాయి. అయితే మా కుటుంబం ఆర్థికంగా రోడ్డుమీద పడేంత స్థితిలో ఏమీ లేదు. అవన్నీ అవాస్తవాలు.. అయితే ఇండస్ట్రీ నుంచి నాకు అవకాశాలు లేవనే మాట నిజమే కానీ మరీ రోడ్డు మీద పడే దీనస్థితిలో లేము అంటూ తెలిపారు.

ఇవి కూడా చదవండి: Bollywoood: రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన బాలీవుడ్ హీరోయిన్స్?

Advertisement

Next Story