2023లో ప్రభాస్ అనారోగ్యం పాలవుతాడా..? వేణు స్వామి సంచలన కామెంట్స్

by Vinod kumar |   ( Updated:2022-12-30 10:52:11.0  )
2023లో ప్రభాస్ అనారోగ్యం పాలవుతాడా..? వేణు స్వామి సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: సెలబ్రిటీల జాతకాల గురించి చెప్తూ సోషల్ మీడియాలో పాపులర్ అయిన వేణు స్వామి.. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ ఆరోగ్యం గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తాజాగా ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ ప్రభాస్ జాతకం గురించి ప్రశ్నించగా.. వేణు స్వామి ఆసక్తికరంగా స్పందించారు. 'వాస్తవానికి నేను సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి చెప్పాలని అనుకోవడం లేదు. కానీ జాతకరీత్యా వారి పర్సనల్ జీవితాలు ఎలా ఎఫెక్ట్ కాబోతున్నాయి అనే విషయాన్ని చెబుతాను. ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, నాగచైతన్య- సమంత వివాహం, రామ్ చరణ్- ఉపాసన సంతానం గురించి ఎనిమిదేళ్ల క్రితమే చెప్పాను.

అయితే అవన్నీ ఆలస్యంగా జరిగినప్పటికీ, నేను చెప్పిన ప్రతి ఒక్కటీ నిజమైంది. కానీ నేను చెప్పింది అర్థం చేసుకోకుండా అభిమానులు విమర్శించారు. ఇక ప్రభాస్ విషయానికి వస్తే.. ప్రభాస్ జాతకరీత్యా అనేక సమస్యలు ఉన్నాయి. 2023 సంవత్సరం అత్యంత దారుణంగా ఉండబోతోంది. ఆయనకు అతిపెద్ద సమస్య రాబోతోంది. దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమవ్వాలి. ప్రధాన సమస్య ఏమిటంటే ఆయన జాతకాలను నమ్మడు. అందుకే ఆయన నటించిన 'రాధేశ్యామ్' సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. దేవుడు, జాతకాల మీద నమ్మకం పెంచుకోకపోతే ఇబ్బందులు తప్పవు' అని వేణు స్వామి చెప్పుకొచ్చారు.

Read more:

Unstoppable Season 2: ప్రభాస్ ఎపిసోడ్ పార్ట్‌వన్ టెలికాస్ట్‌‌కు టైం ఫిక్స్.

Prabhas ఫ్యాన్స్ దెబ్బకు ఆహా సైట్ క్రాష్..! |

అన్ స్టాపబుల్ షో అనధికారిక ప్రసారాలు ఆపివేయండి.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

Advertisement

Next Story