- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వామ్మో.. ప్రభాస్‌తోనా చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే చెడిపోవడం ఖాయం.. సలార్ నటుడు సంచలన కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవల 'కల్కీ 2898 ఏడీ' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రభాస్.. ప్రస్తుతం 'స్పిరిట్', 'కల్కీ 2', 'రాజా సాబ్', 'సలార్ 2' వంటి సినిమాలతో పాటు హను రాఘవపూడి డైరెక్షన్‌లో 'ఫౌజీ' మూవీలో కూడా నటిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వీటిలో 'సలార్ 2' షూటింగ్ స్టార్ట్ చేసేందుకు కాస్త టైం పట్టేలా ఉన్నప్పటికీ.. మిగిలిన ప్రాజెక్టుల విషయంలో మాత్రం ఫుల్ జోష్ మీద ఉన్నాడు డార్లింగ్. ఈ క్రమంలో ప్రభాస్ పై సలార్ నటుడు చేసిన కామెంట్స్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. అదేంటంటే..
ప్రభాస్‌ది రాజుల ఫ్యామిలీ అనే విషయం మనందరికీ తెలిసిందే. నోరూరించే పసందైన వంటకాలతో భోజనం పెట్టడం ప్రభాస్ స్పెషాలిటీ. తాను నటిస్తున్న సినిమా యూనిట్‌కి చాలా మందికి చాలా సార్లు అనేక రకాల వంటకాలతో భోజనం పెడుతూ వస్తున్నారు డార్లింగ్. ఇక తన తోటి కో స్టార్స్‌కి అయితే ప్రత్యేకంగా మరీ వంటకాలు చేయించి వడ్డిస్తుంటాడు. కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తుంటాడు. ప్రభాస్ పంపించిన భోజనం చేశాక, ఆ విషయాన్ని పంచుకోకుండా ఉండని ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. అదే ప్రభాస్ ప్రత్యేకత. ఈ నేపథ్యంలో ప్రభాస్‌పై `సలార్` నటుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయనతో `సలార్`లో నటించిన అనుభవంతో ఆయన అసలు విషయాన్ని పంచుకున్నాడు.
ఆయన మాట్లాడుతూ.. "ఒకసారి నేను నా ఫ్యామిలీతో కలిసి సెట్‌కి వచ్చాను. అప్పుడు సెట్స్‌లో సుమారు 20 రకాల వంటకాలున్నాయి. వాటిని చూసి నా 9 ఏళ్ల కూతురు ఆశ్చర్యపోయింది. ఏం తింటావని అడిగితే అన్నీ సెలెక్ట్ చేసుకుంది. ఆ తర్వాత ప్రభాస్‌ని సర్ మరో రూమ్ ఉందా? ఇవన్నీ దాచి పెట్టుకోవడానికి అని అడగాల్సి వచ్చింది. మార్నింగ్ లేచాక అడిగాను, ఏంటి సర్ మేం అంకుల్స్, ఆంటీలను తీసుకొని సెట్‌కి వచ్చా అనుకున్నారా? అంత ఫుడ్ పంపించారు. మేం ముగ్గురమేకాదా అని అన్నాను. ప్రభాస్‌తో ఈ భోజనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చెడిపోవడం పక్కా. అసలు అతనితో ఉంటే ఆహారం విషయంలో మనం కంట్రోల్‌లో ఉండలేము, ఆయన కంట్రోల్‌గా ఉండనివ్వరు. విభిన్న రకాల వంటకాలు ముందు పెట్టి కొద్ది కొద్దిగా తినమంటే ఎలా సాధ్యం. అందుకే ప్రభాస్‌తో ఉంటే చెడిపోవడం పక్కా. అలాగే డైట్ చేయడం చాలా కష్టము. ఫిట్‌నెస్ గోవింద గోవిందా" అంటూ పృథ్వీరాజ్ ప్రభాస్ భోజనం గురించి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.