- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Wedding Diaries: ఆస్కార్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ చేతుల మీదుగా ‘వెడ్డింగ్ డైరీస్’ ట్రైలర్ రిలీజ్..
దిశ, సినిమా : అగ్నిసాక్షి సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ అంబటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మధ్యలో కొంత కాలం గ్యాప్ తీసుకుని బిగ్ బాస్ లోకి వెళ్ళాడు. ఆ ఫేమ్ తో మళ్ళీ సీరియల్, సినిమాల పైన దృష్టి పెట్టాడు.
ఇక, తాజాగా అర్జున్ అంబటి హీరోగా తెరకెక్కిన మూవీ ‘వెడ్డింగ్ డైరీస్’. ఈ సినిమాలో చాందిని తమిలారసన్ హీరోయిన్ గా నటిస్తుంది. MVR స్టూడియోస్ పతాకంపై వెంకటరమణ మిద్దె స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. వెడ్డింగ్ డైరీస్ మూవీ ఆగస్టు 23న రిలీజ్ కానుంది. తాజాగా, ఈ మూవీ ట్రైలర్ ను ఆస్కార్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ విడుదల చేసారు.
ట్రైలర్ లాంచ్ తర్వాత చంద్రబోస్ మాట్లాడుతూ.. "ఇపుడే చూసాను ఈ సిరీస్ ట్రైలర్.. పెళ్లి తర్వాత భార్య భర్తలకు గొడవలు జరుగుంటాయి .. అవి చాలా కామన్ కానీ ఏవి శాశ్వతం కాదు. ఇద్దరూ ఎలా ఉన్నారనేది మాత్రమే శాశ్వతం అనే సూపర్ కాన్సెప్ట్ తో ఈ వెడ్డింగ్ డైరీస్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మూవీ టీం కి నా శుభాకాంక్షలు. ఆగస్టు 23న విడుదలయ్యే ఈ మూవీని మీకు దగ్గర్లో ఉన్న థియేటర్లో చూసి పెద్ద హిట్ చేయాలని కోరారు" చంద్రబోస్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.