Bobby Deol: ‘దేవర’ లో బాబీ డియోల్ కూడా ఉన్నాడా.. ఆ సీన్స్ కట్ చేసారా?

by Prasanna |
Bobby Deol: ‘దేవర’ లో బాబీ డియోల్ కూడా ఉన్నాడా.. ఆ సీన్స్ కట్ చేసారా?
X

దిశ, వెబ్ డెస్క్ : ఎన్టీఆర్ దేవర మూవీ థియేటర్స్ లో దూసుకెళ్తున్న విషయం మనకీ తెలిసిందే. ఇప్పటికే దేవర మూవీ మూడు రోజుల్లో రూ. 304 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే, దేవర మూవీ చూసిన వారందరికీ ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి. యతి అని చెప్పారు .. కానీ, యతి సినిమాలో కనిపించలేదు.

సముద్రంలో ఉన్న అస్థిపంజరాలు ఎవరివో కూడా చూపించలేదు. దేవరని ఎవరు చంపారు? వర ఇంకా బతికే ఉన్నాడా.. ఇలా ఒకటి కాదు చాలా ప్రశ్నలు వచ్చాయి. అయితే, వీటన్నిటికీ సమాధానాలు దేవర 2 లోనే ఉంటాయని అందరూ అనుకుంటున్నారు.

అయితే, దేవర మూవీలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ సీన్స్ కూడా షూట్ చేసారని ఓ వార్త బయటకు వచ్చింది. కానీ, సినిమా మొత్తం చూసుకున్నా .. బాబీ డియోల్ సీన్ ఎక్కడా చూపించలేదు. క్లైమాక్స్ లో కూడా ఎంట్రీ లేదు.. మూవీలో చూస్తే అసలు బాబీ డియోల్ సీన్స్ ఏ కనిపించే లేదు, అయితే ఆ సీన్స్ కట్ చేసారా ? అనే అనుమానాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Next Story