- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
BSNL: అందుకే భయ్యా నేను BSNL వాడతాను.. ఈ రూ.127ల బెస్ట్ ప్లాన్ గురించి తెలుసుకుంటే నువ్వు కూడా ఇదే చేస్తావ్!

దిశ, వెబ్ డెస్క్: BSNL: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్. బీఎస్ఎన్ఎల్ నుంచి సరికొత్త ప్లాన్ మీకు గొప్పగా ఉంటుంది. ఈ ప్లాన్ లో మీరు ఒక ఏడాదిపాటు అన్ లిమిటెడ్ కాలింగ్, ఇంటర్నెట్ వాడకాన్ని పొందవచ్చు. అత్యుత్తమమైన విషయం ఏంటంటే..ఈ ప్లాన్ సగటు ధర నెలకు రూ. 127 మాత్రమే. అయితే ఈ ప్లాన్ నెట్ ఫ్లిక్స్ లేదా హాట్ స్టార్ నుంచి ఏ ఓటీటీ యాప్ కైనా ఫ్రీ సబ్ స్క్రిప్షన్ పొందవచ్చు. ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్స్ మరింత ఖరీదైనవిగా చేయడంతో ప్రభుత్వ యాజమాన్యంలోని బీఎస్ఎన్ఎల్ లక్షలాదికి బెస్ట్ ఆప్షన్ గా నిలిచింది. . బీఎస్ఎన్ఎల్ ఎప్పుడూ చౌకైన, మంచి ప్లాన్స్ అందిస్తోంది. ఇప్పుడు కంపెనీ రూ. 1,515, రూ. 1,499ధరలతో రెండు కొత్త వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్స్ ప్రారంభించింది. ఈ రెండు ప్లాన్లలో మీరు చాలా తక్కువ ధరకు డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 మెసేజ్ లు వంటి సౌకర్యాలను పొందుతారు.
ఈ రూ. 1,515 ప్లాన్ 365రోజులు చెల్లుబాటును అందిస్తుంది. ఈ ప్లాన్ లో 2జీబీ స్పీడ్ ఇంటర్నెట్ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ తోపాటు రోజుకు 100 మెసేజ్ లు వస్తాయి. . మీరు మొత్తం ఏడాదికి 720 జీబీ డేటాను పొందుతారు. ఈ ప్లాన్ ఖర్చును 12నెలలుగా విభజించినట్లయితే నెలలవారీ ఖర్చు దాదాపు రూ. 126.25 అంటే దాదాపు రూ. 127అవుతుంది. ప్రతినెలా తరచుగా రీఛార్జ్ చేయకుండా అంతరాయం లేని కాలింగ్, ఇంటర్నెట్ ను ఆస్వాదించాలనుకుంటే ఈ ప్లాన్ మీకు బెస్ట్ అని చెప్పవచ్చు. ఇప్పుడు రెండో ప్లాన్ గురించి తెలుసుకుంటే రూ. 1,499 ప్లాన్ లో మీకు రూ. 336 రోజులు అంటే దాదాపు 11నెలల చెల్లుబాటు లభిస్తుంది. ఈ ప్లాన్ ఒకేసారి 24జీబీ డేటాను అందిస్తుంది. మీకు ప్రతిరోజూ డేటా లభించదు. కానీ ఇది అన్ లిమిటెడ్ కాలింగ్ రోజుకు 100 మెసేజ్ లను కూడా అందిస్తుంది.
మీరు ఎక్కువగా ఇంటర్నెట్ ఉపయోగించనట్లయితే కాల్ చేయడం ముఖ్యమైతే ఈ ప్లాన్ మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తం మీద ఈ రెండు బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్ తక్కువ ధరకు దీర్ఘకాలిక మొబైల్ సర్వీసులకు కోరుకునేవారికి బెస్ట్ అని చెప్పవచ్చు.