- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గ్యాస్ సిలిండర్ మారుస్తుండగా అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి

దిశ,తల్లాడ : మిట్టపల్లి గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్యాస్ లీకై ఇంట్లో మంటలు చెలరేగడంతో లోపల ఉన్న ఆరుగురిలో బాలుడు వృద్ధురాలు మృతి చెందగా మరో నలుగురికి తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. మృతుల్లో ఒక బాలుడు, వృద్ధురాలు ఉన్నారు. గాయపడ్డ వారిలో ఒక్కరు పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో గుత్తికొండ వినోద్ (28సం) అనే వ్యక్తి చెల్లెల కుమార్తెలు ప్రిన్సి (9సం)లింసీ(5సం) ఇద్దరు వేసవి సెలవుల్లో కావడంతో మిట్టపల్లి గ్రామంలోని మేనమామ ఇంటికి వచ్చారు. అలాగే గుత్తికొండ వినోద్ తల్లి సుశీల (70 సం), పెద్ద కుమారుడు తరుణ్ (8సం),వరుణ్ (8సం) ఇద్దరు కవల పిల్లలు వేసవి సెలవులు కావడంతో అందరూ ఇంట్లోనే ఉన్నారు. సాయంత్రం 8గంటల సమయంలో గ్యాస్ అయిపోయింది అని గమనించిన గుత్తికొండ వినోద్ మరొక గ్యాస్ సిలిండర్ ను బిగిస్తున్న సమయంలో ఒక్కసారిగా గ్యాస్ లీకై మంటలు వ్యాపించడంతో ఇంట్లోనే ఉన్న దుస్తులకు మంటలు అంటుకొని దట్టమైన పొగలు వ్యాపించాయి.
మంటలో చిక్కుకున్న వినోద్,సుశీల,తరుణ్,వరుణ్,ప్రిన్సి,లింసీ కి తీవ్రగాయాలయ్యాయి.వారిని చికిత్స నిమిత్తం 108 లో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా గుత్తికొండ వినోద్ చిన్న కుమారుడు తరుణ్ పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు 108 వాహనం ద్వారా హైదరాబాదులోని ఓ ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు.చికిత్స పొందుతూ బాలుడు తరుణ్ (7సం)మృతి చెందాడు. గాయపడ్డ వారిలో తల్లి సుశీల(70సం)కూడా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.చెల్లెల కుమార్తె లిమ్సి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది.ఘటన జరిగినప్పుడు పిల్లలు స్నానం చేసి అప్పుడే ఇంట్లోకొచ్చారని ఇంతలోనే ఇలా గ్యాస్ అయిపోవడంతో మరొక గ్యాస్ బిగిస్తున్న సమయంలో మంటలు చెలరేగి ఇలా జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ సమయంలో భార్య రేవతి సరుకులు కొనడానికి దుకాణానికి వెళ్లడంతో ప్రమాదం నుంచి ముప్పుతప్పింది.ఈ ఘటనతో మిట్టపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.