లేడీ గెటప్‌లో విశ్వక్ సేన్.. సినిమా టైటిల్ రిలీజ్

by sudharani |   ( Updated:2024-05-31 07:29:07.0  )
లేడీ గెటప్‌లో విశ్వక్ సేన్.. సినిమా టైటిల్ రిలీజ్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘గ్యాంగ్ ఆఫ్ గోదావరి’ సినిమాతో బిజీగా ఉన్నాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్‌గా నటించగా.. అంజలి కీలక పాత్రలో కనిపించనుంది. విశ్వక్ మాస్, రస్టిక్ రోల్‌లో కనిపించనున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన ప్రతి అప్‌డేట్ ఎంతో ఆకట్టుకున్నాయి. ఇక మూవీ సమ్మర్ స్పెషల్‌గా మే 17 న థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. ‘గ్యాంగ్ ఆఫ్ గోదావరి’ తర్వాత ‘కల్ట్, VS10, VS12’ మూవీస్ చేస్తున్నాడు విశ్వక్. ఇక విశ్వక్ బర్త్‌డే సందర్భంగా VS12 మూవీ నేమ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు ‘లైలా’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో లైలా అంటే మరెవరో కాదు విశ్వక్ సేనే. ఈ చిత్రంలో విశ్వక్ లేడీ గెటప్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా.. రామ్ నారాయన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని షైన్ స్క్రీన్ నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది.

Advertisement

Next Story