- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
స్టార్ హీరోల సరసన నటిస్తున్న విరాట్ కోహ్లీ మరదలు.. ఎవరో తెలిస్తే షాక్?
దిశ, సినిమా: హీరోయిన్ రుహానీ శర్మ.. చి.ల.సౌ సినిమాతో తెలుగు పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ఈ బ్యూటీ ‘డర్టీ హరి, హిట్, 101 జిల్లాల అందగాడు’ వంటి పలు మూవీల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. టాలీవుడ్లోనే కాకుండా రుహానీ.. ఇతర భాషల్లో కూడా నటిస్తోంది. టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన ‘సైంధవ్’ చిత్రంలో ఈ భామ మెయిన్ రోల్లో నటించింది. ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13 వ తేదీన థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది.
అయితే రుహాని తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరై ఆసక్తికర కామెంట్స్ చేసింది. తను చిన్నప్పటి నుంచి హీరో వెంకటేష్ మూవీస్ చూస్తానని, సైంధవ్ మూవీలో కలిసి నటించాక, వెంకటేష్‌కు ఇంకా పెద్ద ఫ్యాన్ అయ్యానని తెలిపింది. డాక్టర్ అవ్వాలని కోరిక ఉండేది కానీ, అనుకోకుండా సినీ ఇండస్ట్రీకి వచ్చానని, కానీ ఈ మూవీలో డాక్టర్ రోల్లో నటించడం చాలా హ్యాపీగా ఉందని చెప్పుకొచ్చింది. ఇక అక్కడున్న ఓ విలేఖరి అనుష్క శర్మతో మీ రిలేషన్ ఏంటి అని ప్రశ్నించగా.. రుహాని ఒక్కసారిగా షాక్ అయ్యింది.
‘‘ఈ విషయం మీకేలా తెలిసింది. నేను మీడియా ముందు కూడా ఎప్పుడూ చెప్పలేదు. ఈ విషయాన్ని చాలా సీక్రెట్‌గా ఉంచాను. ఓకే ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెబుతున్నా.. ఎస్ అనుష్క నాకు అక్క అవుతుంది’’ అని రుహాని చెప్పగా.. దీంతో మీడియా వారు మరీ విరాట్ కోహ్లీ బావ అవుతారా? మీ బావ మీతో ఎలా ఉంటారని ప్రశ్నించారు. విరాట్ కోహ్లీ నాతో చాలా బాగా మాట్లాడుతారు. అనుష్క అండ్ విరాట్ ఫిల్టర్ లేకుండా చాలా సింపుల్‌గా ఉంటారు. వాళ్లలో నాకు అది బాగా నచ్చుతుందంటూ రుహానీ వెల్లడించింది. ఈ వార్త విన్న నెటిజన్లు మీరు బంధువులు అవుతారా? అంటూ షాక్ అవుతున్నారు.