- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుమార్తె మరణించిన వారం రోజులకే విజయ్ ఆంటోని ఏం చేశాడో తెలుసా? ఏం గుండెయ్యా నీది..!
దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని పెద్ద కుమార్తె మీరా ఆంటోని ఈ నెల(సెప్టెంబరు)19వ తేదీన ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. మీరా 16 ఏళ్లకే బలవన్మరణానికి పాల్పడటం కోలీవుడ్ ఇండస్ట్రీతో పాటు టాలీవుడ్ పరిశ్రమ కూడా శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే విజయ్.. వ్యక్తిగత సమస్యల కారణంగా మూవీకి అన్యాయం జరగకూడదనే ఉద్దేశ్యంతో కుమార్తెను కోల్పోయిన 10 రోజల్లోనే తను హీరోగా నటిస్తోన్న ‘రత్తం’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. కాగా చెన్నైలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దుఃఖాన్ని దిగమింగుకుని ఆయన చిన్న కుమార్తెతో కలిసి ఈ కార్యక్రమంలో హాజరయ్యారు.
విజయ్ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న విషయం తెలుసుకున్న జనాలు.. ‘‘ఏం గుండెయ్యా నీది కూతురు చనిపోయిన వారం రోజులకే మరో కూతురితో సినిమాను ప్రమోట్ చేస్తు్న్నావ్.. హ్యాట్సాఫ్ అని కొంతమంది అనగా.. పెద్ద కుమార్తె లేదన్న బాధ నుంచి విజయ్ త్వరగా కోలుకోవాలి, కనీసం వర్క్‌లో పడితేనైనా ఆమె బాధ నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుందని మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారు. కాగా చిత్రం అక్టోబరు 6న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది.