vidya Balan: క్యాస్టింగ్‌ కౌచ్ గురించి తన అనుభవాన్ని వెల్లడించిన విద్యా బాలన్‌!

by Prasanna |   ( Updated:2023-03-11 07:11:00.0  )
vidya Balan: క్యాస్టింగ్‌ కౌచ్ గురించి తన అనుభవాన్ని వెల్లడించిన విద్యా బాలన్‌!
X

దిశ, సినిమా: బాలీవుడ్‌ ‘బొద్దుగుమ్మ’ విద్యాబాలన్‌ గురించి పరిచయం అక్కర్లేదు. సెలక్టివ్ సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్, ప్రొడ్యూసర్ల కారణంగా ఫిమేల్ యాక్టర్స్ ఎలాంటి సంఘటనలు ఎదుర్కుంటారో చెప్పక్కర్లేదు. ఇందులో భాగంగా నటి విద్యా బాలన్ కూడా క్యాస్టింగ్‌ కౌచ్‌ సమస్యను ఎదుర్కొన్నట్లు తెలిపింది. ‘‘మూవీ ఫీల్డ్‌లోకి వచ్చే ముందు, ఇక్కడ పరిస్థితులు భయానకంగా ఉంటాయని చాలామంది నాకు, చాలా కథలు కథలుగా చెప్పారు. ఈ మాటలకు భయపడి నా తల్లి తండ్రులు.. నన్ను సినిమాల్లోకి పంపించడానికి అంగీకరించలేదు. మొత్తానికి కష్టపడి ఒప్పించుకున్న. ఇక ఓ సినిమా గురించి చర్చించడానికి నేను ఓ కాఫీ షాప్‌కి వెళ్ళాను. కథ గురించి మాట్లాడుతున్న సమయంలో ఆ దర్శకుడు ‘మిగతా విషయాలు మనం రూమ్‌కి వెళ్లి మాట్లాడుకుందాం’ అన్నాడు. ఒక్క దాన్నే భయపడుతూ రూమ్‌కి వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్లాక తెలివిగా రూమ్ డోర్ తెరిచిపెట్టాను. అదృష్టవశాత్తు నాకు ఏం జరగలేదు. భయపడకుండా, సమయస్ఫూర్తితో వ్యవహరించి నన్ను నేను రక్షించుకున్న’ అని తెలిపింది.

Advertisement

Next Story