Varsha Bollamma: విడాకులకు కారణం అదేనంటూ పోస్ట్ .. షాక్‌లో నెటిజన్లు

by Hamsa |
Varsha Bollamma: విడాకులకు కారణం అదేనంటూ పోస్ట్ .. షాక్‌లో నెటిజన్లు
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ వర్ష బొల్లమ్మ అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు సతురన్ చిత్రంలో తమిళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు, మలయాళం, తమిళ వంటి భాషల్లో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ అమ్మడు ఇటీవల సందీప్ కిషన్ ‘ఊరు పేరు భరవకోన’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ ఫిబ్రవరి 16న విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక వర్ష బొల్లమ్మ కొత్త సినిమాలు ఓకే చేయడానికి కథలు వింటూనే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. అలాగే వరుస పోస్టులు పెడుతూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.

ఈ క్రమంలో.. తాజాగా, సోషల్ మీడియా యాక్టివిస్ట్ దీపిక నారాయణ్ భరధ్వాజ్ విడాకులకు కారణం ఏంటీ మీ ఉద్దేశం ఏంటని అడిగింది. దీనికి చాలామంది రకరకాల ఆన్సర్స్ ఇచ్చారు. ఇక వర్ష మాత్రం డైవర్స్‌కు కారణం పెళ్లి అంటూ షాకింగ్ సమాధానం ఇచ్చింది. పెళ్లైతేనే విడాకుల సమస్య ఉంటుందని చెప్పడంతో ఈ విషయం తెలుసుకున్న వారంతా వర్షకు పెళ్లిపై ఇలాంటి ఒపీనియన్ ఉందా. పెళ్లి చేసుకుంటే కచ్చితంగా డైవర్స్ తీసుకుంటారా? అందుకే ఈ అమ్మడు లైఫ్‌లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా? అని కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం వర్ష పోస్ట్ వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.





Advertisement

Next Story