రామ్ చరణ్ గురించి వైష్ణవ్ తేజ్ వైరల్ కామెంట్స్

by sudharani |   ( Updated:2023-11-18 11:53:35.0  )
రామ్ చరణ్ గురించి వైష్ణవ్ తేజ్ వైరల్ కామెంట్స్
X

దిశ, సినిమా: మెగా కుటుంబం నుంచి హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వారిలో వైష్ణవ్ తేజ్ ఒకరు. మొదటి సినిమా ‘ఉప్పెన’తో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఆయన.. అనంతరం ‘కొండ పొలం’, ‘రంగరంగ వైభవంగా’ చిత్రాల్లో నటించాడు. కానీ ఈ చిత్రాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక ప్రస్తుతం ‘ఆది కేశవ’ ద్వారా నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వైష్ణవ్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

కాగా ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ స్టైల్ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. ‘మా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలుగా వచ్చారు. అందులో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. కానీ నాకు మాత్రం రామ్ చరణ్ డ్రెస్సింగ్ స్టైల్ అంటే చాలా ఇష్టం. కానీ ఫాలో కాలేను. ఎందుకంటే ఆయన పర్సనాలిటీకి ఆ డ్రెస్సింగ్ స్టైల్ అద్భుతంగా ఉంటుంది. అది నా వల్ల కాదు’ అని చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story