‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ న్యూ ప్రోమో రిలీజ్.. రష్మిక, విజయ్ లవ్ మ్యాటర్‌ను బయటకు లాగిన బాలయ్య..

by sudharani |   ( Updated:2023-12-13 15:42:51.0  )
‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ న్యూ ప్రోమో రిలీజ్.. రష్మిక, విజయ్ లవ్ మ్యాటర్‌ను బయటకు లాగిన బాలయ్య..
X

దిశ, సినిమా: బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ ఇప్పటికే రెండు సీజన్లు కంప్లీట్ కాగా.. ఇటీవల సీజన్ 3 మొదలైంది. లిమిటెడ్ ఎడిషన్ పేరుతో స్పెషల్‌గా ప్రారంభమైన ఈ సీజన్ తాజా ఎపిసోడ్‌కు ‘యానిమల్’ మూవీ హీరో రణ్‌బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా హాజరయ్యారు. తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా.. ఇందులో ‘విస్కీ ఆపేసి నా బ్రాండ్‌కు వచ్చేయవయ్యా.. త్వరగా కథలు రాయడం మొదలు పెడతావ్’ అని సందీప్ రెడ్డిని బాలకృష్ణ ఆటపట్టించగా.. ఇక రష్మికతో విజయ్‌కు కాల్ చేయించాడు.

‘వాట్స్ అప్ రే’ అని విజయ్, రష్మిక కాల్ అటెండ్ చేయగా.. మేడ మీద పార్టీలు ఏంటన్న అని అడిగాడు బాలయ్య. అనంతరం స్క్రీన్‌పై అర్జున్ రెడ్డి, యానిమల్ పోస్టర్స్ చూపించి.. ఇందులో ఏ హీరో బెటర్ అని రష్మికను అడగమని బాలకృష్ణను కోరాడు రణ్‌బీర్. దీంతో ఇద్దరిలో ఎవరు బాగున్నారని రష్మికను అడిగిన బాలయ్య.. ఆమెను ఇరకాటంలో పడేశాడు. మొత్తంగా ప్రోమో ఇంట్రెస్టింగ్‌గా సాగగా.. ఫుల్ ఎపిసోడ్ నవంబర్ 24న ప్రసారం కానుంది.

Advertisement

Next Story