‘ఆదిపురుష్’ రూ.500 కోట్లు డెస్ట్‌‌బిన్ లోకే.. మతపరమైన సినిమాను నాశనం చేసినందుకు మేకర్స్‌కు సిగ్గుండాలి..

by sudharani |   ( Updated:2023-06-13 12:21:02.0  )
‘ఆదిపురుష్’ రూ.500 కోట్లు డెస్ట్‌‌బిన్ లోకే.. మతపరమైన సినిమాను నాశనం చేసినందుకు మేకర్స్‌కు సిగ్గుండాలి..
X

దిశ, వెబ్‌డెస్క్: తనని తను సినీ క్రిటిక్ అనుకునే ఉమైర్ సంధు.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేస్తుంటాడు. ఇండస్ట్రీలో నటీనటులను విమర్శిస్తూ.. వాళ్ల గురించి, సినిమాల గురించి ఏదో ఒక పోస్ట్ పెట్టి సంచలనం సృష్టిస్తుంటాడు. ఈ క్రమంలోనే వరుణ్ ఎంగేజ్మెంట్‌కి పవన్ కళ్యాణ్ పీకల దాక తాగివచ్చినట్లు ట్వీట్ పెట్టాడు సంధు. తాజాగా.. ఈయన పెట్టిన మరో పోస్ట్ ప్రస్తుతం సంచలనం సృష్టిస్తుంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘ఆదిపురుష్’. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన ఈ మూవీ రామాయణం బ్యాక్ డ్రాప్‌లో రానుంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న చిత్రం.. జూన్ 16న విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి ఉమైర్ సంధు ఓ ట్వీట్ చేశారు. ఈ మేరకు ‘‘ఆదిపురుష్’ సినిమా ఫస్ట్ రివ్యూ.. దీనికోసం పెట్టిన రూ.500 కోట్టు డెస్ట్‌బిన్‌లో వేసినట్లే. ఇందులో నటించిన నటీనటులందరి ఫేక్ నటనకు, చెడు ప్రదర్శనతో 3 గంటలు సినిమా చూసేవారికి హింసలా ఉంటుంది. మతపరమైన సినిమాను ఇలా నాశనం చేసినందుకు మేకర్స్‌కు సిగ్గు ఉండాలి’ అంటూ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు మండిపడుతున్నారు.

Also Read: విజయ్ ఆంటోనీ ‘విక్రమ్ రాథోడ్’ ఫస్ట్ లుక్..!

ఆదిపురుష్ సినిమా ప్రమోషన్స్ కు భక్తిని వాడుకుంటుందా?

తెలంగాణలో ‘ఆదిపురుష్‌’ అడ్వాన్స్‌ బుకింగ్‌ అప్పటి నుంచే..

Advertisement

Next Story