- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Brahmanandam: ఆ కమెడియన్‌ను తలుచుకుంటూ ఎమోషనల్ అయిన బ్రహ్మానందం.. నేను చనిపోతే నువ్వు రావోద్దు అంటూ
దిశ, సినిమా: స్టార్ కమెడియన్ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజేంద్ర ప్రసాద్ నటించిన ‘అహనా పెళ్లంట’ అనే మూవీ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనదైనా మార్క్‌ను క్రియేట్ చేసుకున్నాడు. కామెడీ అంటే బ్రహ్మానందం.. బ్రహ్మానందం అంటే కామెడీ అనే లెవెల్‌కి ఎదిగారు. ఇక ప్రతి సినిమాలో తన కామెడీ టైమింగ్, నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఒకప్పుడు బ్రహ్మానందం లేని సినిమా ఉండదు అని అనడంలో ఏమాత్రం అతియోశక్తి లేదు. దాదాపు 1300 కు పైగా సినిమాల్లో నటించి పద్మశ్రీ అవార్డు అందుకున్న గొప్ప నటుడు బ్రహ్మానందం. కేవలం తెలుగులోనే కాకుండా వివిధ భాషల్లో నటించి అక్కడ కూడా తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక తాజాగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కల్కి మూవీలో కూడా గెస్ట్ అప్పీయిరీన్స్‌లో మెరిసాడు.
ఇదిలా ఉంటే ఒకప్పుడు తన కామెడీతో ప్రేక్షకులను విపరీతంగా నవ్వించి మెప్పించిన నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం 2013 డిసెంబర్ 7 న అనారోగ్య కారణాలతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇక హాస్య బ్రహ్మ బ్రహ్మానందంకు ధర్మవరపు సుబ్రహ్మణ్యంకు మధ్య మంచి అనుబంధం ఉండేది. ఈ ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉండేవారు. అయితే బ్రహ్మానందం తన ఫ్రెండ్ అయిన ధర్మవరపు సుబ్రహ్మణ్యంను చనిపోయినప్పుడు తనను గుర్తు చేసుకుంటూ చాలా ఎమోషనల్ అయ్యారు.
ఆయన గురించి బ్రహ్మి మాట్లాడుతూ.. ధర్మవరంను నేను ధర్మన్న అని పిలిచేవాడిని.. చనిపోయే ముందు నాకు ఫోన్ చేసి నాది ఒక చిన్న రిక్వెస్ట్ రా.. నువ్వు నన్ను చూడటానికి రావొద్దురా.. నువ్వు నన్ను చూడలేవు. ఇంతకుముందు నువ్వు చూసినట్టు నేను ఇప్పుడు లేను.. నా పరిస్థితి బాలేదు. నీ గుర్తుల్లో నేను ఎలా ఉన్నానో అలానే ఉండాలి. కాబట్టి నన్ను చూడటానికి రావొద్దు రా అన్నాడు. కానీ నేను రోజూ వెళ్లి చూడాలని ట్రై చేసేవాడిని బట్ వద్దు అని నన్ను ఆపేవాడు. కాదు కాదు నేను వస్తాను అని పట్టు పడితే.. డిసెంబర్ నెలలో వద్దువు గాని.. అప్పడు అయితే నేను ఆ పాటికి కోలుకుని ఇంతకు ముందులా యాక్టివ‌్‌గా ఉంటాను అన్నాడు. అలాగే నీకోసం ఓ పద్యం పడతాను అని ఓ పద్యం పాడాడు.. నేను త్వరగానే వచ్చేస్తా.. మనం అందరం మళ్లీ కలిసి నటిద్దాం అని చెప్పారు అంటూ బ్రహ్మానందం కళ్లలో కన్నీళ్లతో ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.
(video link credits to sri balaji movies you tube id)