- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లి పనులు మొదలు పెట్టిన టాలీవుడ్ యంగ్ హీరో.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ‘రాజావారు రాణివారు’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రజెంట్ ఈ యంగ్ హీరో ‘క’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే కిరణ్ అబ్బవరం పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఆయన గత కొద్ది కాలంగా తన మొదటి సినిమాలో నటించిన హీరోయిన్ రహస్య గోరఖ్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.
ఇటీవల మార్చిలో వీరిద్దరు తమ ప్రేమ విషయాన్ని నిశ్చితార్థం చేసుకుని బయటపెట్టారు. తాము ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు తొందరలో వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నట్లు ప్రకటించారు. దీంతో సడెన్‌గా ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అయితే కిరణ్ అబ్బవరం మాత్రం తాము ఆగస్టులో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. కానీ ఇటీవల వయనాడ్ ఘటన వల్ల పెళ్లికి ఆటంకం కలుగుతుందని వాయిదా వేసినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో.. తాజాగా, కిరణ్ అబ్బవరం పెళ్లి పనులు మొదలయ్యాయి. ఈ విషయాన్ని ఆయనకు కాబోయే భార్య రహస్య ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది.
అంతేకాకుండా పూజలు చేస్తున్న ఫొటోలు షేర్ చేసింది. ఈ ఫొటోలకు ఇట్స్ బిగినింగ్ అంటూ క్యాప్షన్ జత చేసింది. అలాగే సంగీత్ కోసం డ్యాన్సులు ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను పెట్టింది. కానీ పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారో డేట్ మాత్రం రివీల్ చేయలేదు. ఇక ఈ వారంలోనే వీరిద్దరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. తొందరలోనే ఈ యంగ్ హీరో ఓ ఇంటివాడు కాబోతున్నాడని అంటున్నారు.