- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్యాంకులో ఏకంగా రూ. 40 కోట్లు లేపేసిన టాలీవుడ్ నిర్మాత.. చీటింగ్ కేసు నమోదు!
దిశ, సినిమా: రియల్ ఎస్టేట్ వ్యాపారిగా, నటుడిగా, సినీ నిర్మాతగా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. స్టార్ ప్రొడ్యూసర్ కావాలనే ఆశతో ఇండస్ట్రీకి బయల్దేరాడు. కానీ వర్కౌట్ కాలేదు. ఈయన నిర్మించిన చిత్రాలు పెద్దగా ఆడకపోవడంతో హీరోగా ప్రయత్నించాడు. అది వర్కౌట్ కాలేదు. చివరకు తాజాగా బ్యాంక్ స్టాఫ్ ను మోసం చేసి ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 40 కోట్లు లేపేశాడు. వివరాల్లోకెళ్తే.. షేక్ బషీద్ అనే నిర్మాత హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటాడు. ఈయనపై పోలీసు స్టేషనులో 10 చీటింగ్ కేసులు ఉన్నాయట. ఖరీదైన ప్రాంతాల్లోని ఇండ్లు ఆయనవేనని నకిలీ పత్రాలు క్రియేట్ చేసి.. బ్యాంకుల్లో లోన్ తీసుకున్నాడు. ఆ డబ్బును సినిమాలకు పెట్టుబడి పెట్టాడు.
ప్రస్తుతం కూడా తప్పుడు ధృవపత్రాలు క్రియేట్ చేసి.. బ్యాంకుకే టోకరా వేశాడు. ఈ కేసును సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గరిని అరెస్టు చేసినట్లు ఈవోడబ్లూ డీసీపీ ప్రసాద్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది జులై 12 వ తేదీన శంషాబాద్ బ్రాంచ్‌లో కుకునూరు ఉదయ్‌కుమార్‌రెడ్డి పేరుతో ఉన్న అకౌంట్ కు ఒకసారి 25 కోట్ల రూపాయలు, మరోసారి 15 కోట రూపాయలు రామస్వామితో సహా బ్యాంకు ఉద్యోగి ఎస్.రాజేశ్ బదిలీ చేశారట. ఈ డబ్బుతో రెండు కార్లు కొన్నారట. ప్రస్తుతం రామస్వామి, రాజేష్‌లు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. బషీద్ ను సోమవారం ఢిల్లీలో అరెస్ట్ చేసి హైదరాబాదుకు తరలించారు. ఇక గుంటూరు వేజెండ్ల ప్రాంతానికి చెందిన నిందితుడు షేక్ బషీద్ ఎవడ్రా హీరో సినిమాలో హీరోగా నటించాడు.