రెండోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. పోస్ట్ వైరల్

by Kavitha |   ( Updated:2024-07-25 08:07:54.0  )
రెండోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: బావ’ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ప్రణీత సుభాష్ అందరికీ సుపరిచితమే. తర్వాత ‘అత్తారింటికి దారేది’, ‘రభస’, ‘బ్రహ్మోత్సవం’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. పవన్ కళ్యాణ్ సరసన బాపుగారి బొమ్మ సాంగ్‌లో నటించి బయట కూడా కుర్రాళ్ళ గుండెల్లో బాపుగారి బొమ్మ అనే ముద్ర వేసుకుంది. కానీ నటన పరంగా బాగానే చేసినా ఆఫర్లు మాత్రం అనుకున్న రేంజ్‌లో అయితే రాలేవు. ఇక స్టార్ హీరో సినిమాల్లో సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్లు చేస్తూ తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ‘అత్తారింటికి దారేది’ సినిమా తర్వాత మరో సినిమా చేయకుండా బిజినెస్‌మ్యాన్ నితిన్ రాజును 2021లో పెళ్లి చేసుకుంది ఈ అమ్మడు. ఇక 2022 లో వీరికి ఒక పాప కూడా జన్మనిచ్చింది. అలా పెళ్లి తర్వాత సినిమాలకు దూరం ఉన్న ప్రణీత.. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ తన ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో బేబిబంప్‌తో ఉన్న తన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

తాజాగా ప్రణీత సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో బ్లాక్ స్లీవ్‌లెస్ టీ షర్ట్, బ్లూ ప్యాంట్ వేసుకొని ఫొటోలకు పోజులిచ్చింది. అంతే కాకుండా రౌండ్ 2.. ప్యాంట్‌లు సరిపోవట్లేదు అంటూ క్యాప్షన్ జోడించింది. అది చూసిన నెటిజన్లు ప్రణీత మరోసారి తల్లి కాబోతుందని తనకు అభినందనలు తెలుపుతున్నారు. ప్రస్తుతం బేబిబంప్‌తో ఉన్న ప్రణీత పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

(video link credits to praneetha subhash instagram id)

Advertisement

Next Story

Most Viewed