ఈ రోజు ఆమె మాత్రమే నన్ను నమ్మింది : నాని

by Kavitha |   ( Updated:2024-03-17 07:53:42.0  )
ఈ రోజు ఆమె మాత్రమే నన్ను నమ్మింది : నాని
X

దిశ, సినిమా: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని అనతి కాలంలోనే సినిమా ఇండస్ట్రీలో చకచకా ఎదిగాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా మొదలైన తన ప్రయాణంలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు వెళ్ళాడు. ఆ సక్సెస్ కోసం అతను పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. అయితే తన జీవితంలో జరిగిన అనేక సంఘటనలు ఎలాంటి భయాలు లేకుండా అందరితో పంచుకుంటాడు నాని. ఇందులో భాగంగా తాజాగా తనకు సంబంధించిన కొన్ని విషయాలు షేర్ చేసుకున్నాడు.. ‘ ఆ రోజు నా 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల. మహా అయితే వీడు మూడో క్లాస్ లో పాస్ అవుతాడు.. లేదంటే ఫెయిలవుతాడు అని నా మీద అందరికీ ఒక క్లారిటీ ఉంది... అప్పట్లో ఆన్ లైన్ లేదు కాబట్టి పేపర్స్‌లో రిజల్ట్స్ పేపర్ ప్రింట్ చేసేవారు. అలా ముందు థర్డ్ క్లాస్ లిస్టులోనే వెతకడం ప్రారంభించారు.

అక్కడ దొరకకపోవడంతో ఇంకా అంతా నాని ఫెయిల్ అయిపోయాడు అని డిసైడ్ అయ్యారు. కానీ అపార నమ్మకం ఉన్న మా తల్లి ఎందుకైనా మంచిది సెకండ్ క్లాస్ లో చూద్దాం అని చూస్తే అక్కడ కూడా నా నెంబర్ కనిపించలేదు. దీంతో ఆమె కూడా వీడి వల్ల అయ్యే పని కాదు అని అనుకుంది. కానీ ఫస్ట్ క్లాస్ రిజల్ట్స్‌లో వెతకడం మాత్రం చేయలేదు. అప్పుడే మా ఫ్రేండ్స్ వచ్చి నాని ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడని చెప్పడంతో గబగబా వెళ్లి ఫస్ట్ క్లాస్ లో వెతకడంతో నా రిజల్ట్స్ కనిపించింది. అదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఆ తర్వాత ఏ ఎగ్జామ్ కూడా ఒకేసారి పాస్ అయింది లేదు’ అంటూ నాని సరదాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Read More..

రజినీకాంత్ సినిమాలో నటించే చాన్స్ అంటూ పోస్ట్.. మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేసిన మహిళ

Advertisement

Next Story