నిన్నటి వరకు ఒక లెక్క ఇప్పుడు ఓ లెక్క!.. ఇన్నాళ్లకు రాజమౌళిని భయపెట్టే డైరెక్టర్ వచ్చాడోచ్..

by Kavitha |
నిన్నటి వరకు ఒక లెక్క ఇప్పుడు ఓ లెక్క!.. ఇన్నాళ్లకు రాజమౌళిని భయపెట్టే డైరెక్టర్ వచ్చాడోచ్..
X

దిశ, సినిమా: ప్రస్తుతం ఇండియాలో టాప్ డైరెక్టర్ ఎవరంటే అందరూ చెప్పే పేరు దర్శకధీరుడు రాజమౌళి. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' చిత్రాలతో తెలుగు సినిమా స్థాయిని పెంచడమే కాకుండా, దర్శకుడిగా గ్లోబల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. అలాంటి రాజమౌళికి ధీటైన దర్శకుడు ఎవరంటే.. ఎవరో ఒకరి పేరు బలంగా చెప్పలేము. అయితే అదంతా నిన్నటి వరకు. ఇప్పుడు లెక్క మారింది. రాజమౌళికి సవాల్ విసిరే దర్శకుడు వచ్చాడు. ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నేషనల్ వైడ్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ పేరు మారుమోగిపోయింది.

ప్రభాస్ హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 AD' చిత్రం తాజాగా థియేటర్లలోకి అడుగు పెట్టింది. ఈ సినిమాకి మొదటి షో నుంచే అదిరిపోయే పాజిటివ్ టాక్ వస్తోంది. ముఖ్యంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇండియన్ సినీ చరిత్రలోనే ఇలాంటి కథతో సినిమా రాలేదని, విజువల్ వండర్ అని, హాలీవుడ్ సినిమాలను తలపించేలా కల్కి ఉందని అంటున్నారు. మైథలాజికల్ టచ్ తో సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ గా 'కల్కి'ని మలిచిన దర్శకుడు నాగ్ అశ్విన్ విజన్ గొప్పగా ఉందని.. కొన్ని కొన్ని సన్నివేశాలు చూస్తుంటే రాజమౌళిని సవాల్ చేసే అసలుసిసలైన డైరెక్టర్ వచ్చాడనే అభిప్రాయం కలుగుతోందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది.


Next Story