- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హృదయం గాయపడి, విరిగిపోయినప్పుడు ఇదొక్కటే మార్గం.. శ్రీజ ఎమోషనల్ పోస్ట్
దిశ, వెబ్‌డెస్క్: చిరంజీవి చిన్నకూతురిగా శ్రీజ సోషల్ మీడియాలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఓ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయి మెగా ఫ్యామిలీకి షాకిచ్చింది. ఆ తర్వాత ఓ కూతురు పుట్టాక ఏవో కారణాల వల్ల భర్తతో విడాకులు తీసుకుని విడిపోయింది. అప్పుడు చిరంజీవి కూతురి బాధను చూడలేక చేరదీసి ఆమెకు హీరో కల్యాణ్ దేవ్‌తో రెండో పెళ్లి చేశారు. వీరిద్దరి కాపురం కొద్ది రోజులు బాగానే సాగింది. ఓ కూతురు కూడా పుట్టింది. అయితే శ్రీజ, కల్యాణ్ మధ్య ఏవో మనస్పర్థలు తలెత్తడంతో ఇద్దరు దూరంగా ఉంటున్నారు. ఇటీవల వీరిద్దరూ విడాకులు కూడా తీసుకున్నట్లు ఎన్నో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయినా కానీ వాటిని పట్టించుకోకుండా శ్రీజ తన పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తుంది. అలాగే ఇటీవల వరుణ్ తేజ్ పెళ్లికి కూడా హాజరైంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు చేస్తూ ఉంటుంది.
తాజాగా, శ్రీజ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. ‘‘విషయాలు నా నియంత్రణలో లేనప్పుడు, పరిస్థితులు అస్తవ్యస్తంగా మారి శబ్దం చేస్తున్నప్పుడు, హృదయం గాయపడుతుంది, విరిగిపోతుంది. మనస్సు కలత చెందుతుంది క్షీణిస్తుంది. శరీరం అలసిపోతుంది.. బలహీనంగా ఉంటుంది. విరామం ఉన్నప్పుడు.. నా కళ్ళు మూసుకుని, నిర్మలమైన అంతర్గత ప్రపంచానికి మళ్లీ కనెక్ట్ అవుతూ గతాన్ని తలుచుకుంటాను. ఇదొక్కటే మార్గం....!’’ అని రాసుకొచ్చింది. అలాగే ఓ ఫొటోను కూడా షేర్ చేసింది. అలాగే దీనికి కామెంట్లు కనపడకుండా సెట్ చేసింది. అయితే ఈ పోస్టును చూస్తే తన జీవితంలో జరిగిన సంఘటనల వల్ల తాను ఎంతో బాధపడుతున్నట్లు శ్రీజ తెలుపుతూ పోస్టు పెట్టిందని అర్థం అవుతుంది. ప్రస్తుతం శ్రీజ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
- Tags
- Sreeja Konidela