నా కెరీర్‌లో ది మోస్ట్ థ్రిల్లింగ్ షాట్ ఇదే.. కియారా

by sudharani |   ( Updated:2023-07-13 06:11:32.0  )
నా కెరీర్‌లో ది మోస్ట్ థ్రిల్లింగ్ షాట్ ఇదే.. కియారా
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి కియారా అద్వానీ ‘సత్యప్రేమ్ కి కథ’ సినిమా నుంచి తనకు బాగా ఇష్టమైన సన్నీవేశాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది. కార్తిక్ ఆర్యన్ హీరోగా వచ్చిన ఈ మూవీ జూన్ 29న విడుదలవగా.. ఇందులోని ‘రాత్ బాకీ’ పాట నుంచి సింగిల్ షాట్ డ్యాన్స్ సీక్వెన్స్‌ను నెట్టింట పోస్ట్ చేసింది. ‘అత్యంత థ్రిల్లింగ్ షాట్. ఒక నటిగా దీనిని చూసి గర్వంగా ఫీల్ అవుతున్నా. సెట్‌లో ఎక్కువమంది ఉన్నపుడు చాలా టెన్స్‌న్‌గా ఉంటుంది. అలాంటి సమయంలో అందరి సమన్వయం చాలా కీలకం. ఎల్లప్పుడూ ఉత్తమమైన టేక్‌ని పొందడానికే టీమ్ ప్రయత్నిస్తోంది. కాబట్టి కెమెరా ఆపరేటర్‌ను గందరగోళానికి గురిచేయకుండా మనోహరంగా నృత్యం చేయడం అంత ఈజీకాదు. ఈ విషయంలో నాకు అండగా నిలిచిన నా సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు. పర్ఫెక్ట్ షాట్‌ను పొందినప్పుడు ప్రతి ఒక్కరి ముఖంలో ఉన్న ఉత్సాహం నాకు బాగా గుర్తుంది. దానిని పెద్ద స్క్రీన్‌పై చూడటం చాలా సంతృప్తికరంగా ఉంది’ అంటూ మురిసిపోయింది.

Advertisement

Next Story