- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అఖిల్ ‘ఏజెంట్’ సినిమాపై అమల రియాక్షన్ ఇదే.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్
దిశ, వెబ్ డెస్క్: అక్కినేని అఖిల్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘ఏజెంట్’. ఇందులో బాలీవుడ్ బ్యూటీ సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ఏప్రిల్ 28న విడుదలై నెగిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా, ఈ సినిమాపై అక్కినేని అమల తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. ‘‘ట్రోలింగ్ అనేది ఎప్పుడూ ఉండేదే. ఎందుకలా చేస్తారనేది నేను అర్థం చేసుకున్నాను. నేను నిన్న ‘ఏజెంట్’ సినిమాను చూశాను. ఈ చిత్రం నిజాయితీగా ఆస్వాదించాను. అందులో లోపాలు ఉన్నప్పటికీ మనసు విప్పి చూస్తే ఆశ్చర్యపోతారు. నేను చూసిన హాల్ కిక్కిరిసిపోయింది. ప్రేక్షకులలో సగం మంది స్త్రీలు, తల్లులు, అమ్మమ్మలతో పాటు వారి భర్తలు, కొడుకులు ఉన్నారు. యాక్షన్ సీన్స్ జరిగినప్పుడు కేకలు వచ్చాయి. నేను ఒకటే చెప్పగలను. అఖిల్ తర్వాత చేయబోయే సినిమా ఇంకా బాగుంటుంది’’ అంటూ రాసుకొచ్చింది.