ఈ బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు మన దేశంలో ఓటు వేయలేరు.. ఎందుకో తెలిస్తే షాక్

by Kavitha |   ( Updated:2024-04-24 14:37:45.0  )
ఈ బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు మన దేశంలో ఓటు వేయలేరు.. ఎందుకో తెలిస్తే షాక్
X

దిశ,సినిమా: భారతదేశంలో లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు మొత్తం ఏడు దశల్లో ఓటింగ్ జరగనుంది. ఇప్పటికే సూర్య, విజయ్, విక్రమ్ సహా స్టార్లు తమిళనాడులో జరిగిన మొదటి దశ పోలింగ్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే కొంతమంది బాలీవుడ్ భామలకు మన దేశంలో ఓటు హక్కు లేదు. ఈ జాబితాలో ఎవరెవరు ఉన్నారో మనం ఇక్కడ తెలుసుకుందాం.

*ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్(RRR)బ్యూటీ అలియా భట్ (Alia Bhatt) కు మన దేశంలో ఓటు హక్కు లేదు. ఎందుకంటే ఆమె ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జన్మించింది.

Read More...

సినిమా అవకాశం కోసం వెళ్తే.. పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

*నోరా ఫతేహి (Nora Fatehi) తల్లిదండ్రులు ఇద్దరూ మొరాకోకు చెందిన వారు. కాగా ఆమె కెనడా లో పుట్టి పెరిగింది. అందుకే ఆమెకు కెనడా పౌరసత్వం ఉండటం వలన భారత దేశ ఎన్నికల్లో ఓటు వేసే హక్కు లేదు.

* మర్డర్ 2 మూవీ తో ఫేమస్ అయిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez)తండ్రిది శ్రీలంక అందుకే జాక్వెలిన్ కు శ్రీలంక పౌరసత్వం ఉంది. కాబట్టి భారత దేశ ఎన్నికల్లో ఆమెకు ఓటు వేసే హక్కు లేదు.

*ఇక బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ (Katrina Kaif) బ్రిటిష్ హాంకాంగ్‌లో జన్మించినందున ఆమెకు భారత పౌరసత్వం లేదు. అందుకే భారతదేశంలో క్యాట్ కు కూడా ఓటు హక్కు లేదు.

Advertisement

Next Story

Most Viewed