- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాజమౌళి ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన స్టార్స్ వీళ్లే..! బాలీవుడ్ అగ్రహీరోలు సైతం..
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాన్ ఇండియా రేంజ్‌లో ఎన్నో హిట్‌లను అందించిన రాజమౌళి దర్శకత్వంలో సినిమాలు చేయాలని ఎంతో మంది అగ్ర హీరోలు సైతం క్యూ కడుతున్నారు. కానీ, రాజమౌళి ఆఫర్ ఇచ్చినా కొంత మంది రిజెక్ట్ చేశారట. వారెవరో తెలుసుకుందాం..
బాహుబలి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టింది. అలాంటి సినిమాను మొదట బాలీవుడ్ సెలబ్రిటీస్‌తో తెరకెక్కిద్దామనుకున్నాడట. అక్కడ రాజమౌళి ఆఫర్‌ను ఎవరు పట్టించుకోలేదట. ఇలా బాహుబలిలో ఆఫర్ పోగొట్టుకున్న తారలు ఎవరో తెలుసుకుందాం.. శివగామి పాత్ర కోసం ముందుగా శ్రీదేవిని సంప్రదించారట. ఆమె ఎక్కువ పారితోషికం అడిగిందట. తర్వాత మంచు లక్ష్మిని అడగ్గా.. ప్రభాస్, రానాకు తల్లి పాత్రలో చేయనని చెప్పిందట. దీంతో ఆ ప్రాజెక్ట్ రమ్యకృష్ణను వరించింది. అంతే కాదు ఆ పాత్రలో రమ్యకృష్ణ తప్ప మరెవరూ షూట్ కాదు అనే వాదన కూడా లేకపోలేదు.
ఇక తమిళ స్టార్ హీరో సూర్యను కూడా బాహుబలిలో ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం అడిగారట. కానీ ఆ క్యారెక్టర్ చేయడానికి ఆయన నిరాకరించారు. ఈ విషయాన్ని సూర్య కూడా అనేక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అలాగే.. బళ్లాలదేవుడి రోల్‌కు వివేక్ ఒబెరాయ్‌ను అనుకున్నారట. ఆయన అప్పటికే వేరే ప్రాజెక్ట్‌తో బిజీగా ఉండి అది కూడా క్యాన్సిల్ అయిందట. ఇక ఫైనల్లీ.. బాహుబలి సినిమాలో మెయిన్ రోల్ అయిన కట్టప్ప క్యారెక్టర్‌కు మోహన్ లాల్‌ను, అమితాబ్ బచ్చన్‌ను అనుకున్నారట. వాళ్లు కూడా వేరే ప్రాజెక్టులలో బిజీగా ఉండటంతో అవి కూడా రిజెక్ట్ అయింది. బాహుబళి ముందుగా బాలీవుడ్ ప్రాజెక్ట్ అనుకొని ఈ సినిమా కోసం హృతిక్‌ను సంప్రదించాడు. ఆ తర్వాత ప్రభాస్‌తో తెలుగులో ఈ ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టాడు.
- Tags
- S. S. Rajamouli