వామ్మో సితార ఫ్రెండ్స్ ఏంటీ ఇలా ఉన్నారు.. వీడియో వైరల్

by sudharani |   ( Updated:2023-07-25 06:38:07.0  )
వామ్మో సితార ఫ్రెండ్స్ ఏంటీ ఇలా ఉన్నారు.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రిన్స్ మహేష్ బాబు - నమ్రతా శిరోద్కర్‌ల గారాల పట్టి సితార గురించి అందరికి తెలిసిందే. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ అమ్మడు.. చిన్న వయసులో తన ప్రతిభను చాటుకుని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇక తాజాగా (జూలై-20) తన పుట్టిన రోజు సందర్భంగా మరోసారి తన పెద్ద మనసు చాటుకున్న సితార.. మహేశ్ బాబు ఫౌండేషన్‌లోని అమ్మాయిలకు సైకిళ్లను గిఫ్ట్‌గా ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. మార్నింగ్ ఫౌండేషన్‌లో కేక్ కట్ చేసిన సితార.. సాయంత్రం చిన్న పార్టీ సెలబ్రేట్ చేసుకుంది. తన కుటుంబంతో పాటు.. సితారా ఫ్రెండ్స్ ఈ బర్త్‌డే పార్టీకి హాజరయ్యారు. తన ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసిన సితార.. దీనికి సంబంధించిన వీడియో తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు. కొంత మంది బర్త్‌డే విషేష్ తెలుపుతుంటే.. ‘‘ఓవర్ యాక్షన్ కంపెనీ, సితార ఫ్రెండ్స్ ఏంటీ ఇలా ఉన్నారు’’ అంటూ మరికొందరు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement

Next Story