మూడో భర్తకు కూడా విడాకులు ఇచ్చేసిన స్టార్ సింగర్.. అధికారిక ప్రకటనతో షాక్‌లో ఫ్యాన్స్!

by Disha Web Desk 6 |
మూడో భర్తకు కూడా విడాకులు ఇచ్చేసిన స్టార్ సింగర్.. అధికారిక ప్రకటనతో షాక్‌లో ఫ్యాన్స్!
X

దిశ, సినిమా: హాలీవుడ్ స్టార్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె పాప్ సింగర్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పలు సాంగ్స్ పాడి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఇక బ్రిట్నీ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే కెరీర్ పీక్స్‌లో ఉండగా ఆమె 2004లో తన చిన్ననాటి ఫ్రెండ్ అలెగ్జాండర్‌ను పెళ్లి చేసుకుంది. కానీ వీరిద్దరి మధ్య ఏవో మనస్పర్థలు రావడంతో ఏడాదికే విడాకులు తీసుకుని విడిపోయింది. ఇక అదే ఏడాది బ్రిట్నీ కెవిన్ ఫెడర్‌లైన్ అనే వ్యక్తిని రెండోసారి పెళ్లి చేసుకుంది.

వీరికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. అయినప్పటికీ 2007లో ఈ జంట విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక బిట్నీ నటుడు సామ్ అస్గారితో కొద్ది కాలం పాటు డేటింగ్ చేసింది. 2022లో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. కానీ వీరిద్దరి కాపురం ఎక్కువకాలం నిలవలేకపోయింది. పెళ్లి జరిగిన రెండేళ్లకే విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది జూలైలో ఈ జంట విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ వీరికి విడాకులు మంజూరు కాలేదు. తాజాగా, బ్రిట్నీ స్పియర్, సామ్ అస్గారి లాస్ ఏంజెల్స్ కోర్టు మే 2 న వీరికి విడాకులు మంజూరు చేసింది.

Next Story