పాముకు భయపడి బ్లాక్ బస్టర్ సినిమా వదులుకున్న స్టార్ హీరోయిన్!

by Jakkula Samataha |
పాముకు భయపడి బ్లాక్ బస్టర్ సినిమా వదులుకున్న స్టార్ హీరోయిన్!
X

దిశ, సినిమా : అలనాటి తారల్లో జయప్రద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.నటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ ఆమె అంటే చాలా మందికి ఇష్టం. కాగా, నటి జయప్రద గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అవకాశం అనేది ఒకేసారి వస్తుంది. ముఖ్యం చిత్రపరిశ్రమలో అవకాశం వస్తే అందిపుచ్చుకోవాలి లేకపోతే నిలదొక్కుకోవడం కష్టం అవుతుదని అంటారు. మరీ ముఖ్యంగా చాలా మంది హీరోయిన్స్ ఎక్కువగా బాలీవుడ్ ఆఫర్స్ కోసం ఎదురు చూస్తుంటారు.అయితే జయప్రదకు బాలీవుడ్ నుంచి రిషికపూర్ సరసన నటించడానికి ఆఫర్ వచ్చిందంట. కానీ ఓ చిన్న కారణంతో నటి ఆ అవకాశాన్ని వదులుకుందంట.




విషయంలోకి వెళ్లితే.. 1986లో ‘నాగిన్’ పేరుతో విడుదలైన సినిమా, రికార్డు క్రియేట్ చేసింది. ఈ మూవీలో శ్రీదేవి హీరోయిన్‌గా నటించి ప్రశంసలు అందుకుంది. అయితే ఈ ఆఫర్ మొదట జయప్రదకు వచ్చిందంట. కానీ ఆమెకు పాములంటే చాలా భయం, పాము పేరు వింటేనే భయపడుతుందంట, అందుకే నాగుపాములా నటించడం ఇష్టంలేక నాగిన్ సినిమాలో అవకాశాన్ని వదులుకుందంట. తర్వాత మూవీ మేకర్స్ శ్రీదేవిని సంప్రదించడంతో ఆమె సినిమాకు ఓకే చెప్పి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.

Next Story

Most Viewed