‘విరూపాక్ష’ చిత్ర నిర్మాణ సంస్థపై మండిపడ్డ స్టార్ హీరోయిన్

by Anjali |   ( Updated:2023-03-23 05:14:56.0  )
‘విరూపాక్ష’ చిత్ర నిర్మాణ సంస్థపై మండిపడ్డ స్టార్ హీరోయిన్
X

దిశ,వెబ్‌డెస్క్: కేరళ ముద్దుగుమ్మ *సంయుక్త మీనన్ టాలీవుడ్‌లో వరుస సినిమాలతో అలరిస్తోంది. భీమ్లా నాయక్ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టి.. ఆ తర్వాత బింబిసార, సార్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ భామ కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘విరూపాక్ష’ చిత్రంలో నటిస్తోంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా హీరోయిన్ సంయుక్త మీనన్ ఈ చిత్ర నిర్మాణ సంస్థపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

‘ఈ చిత్రంలో గొప్ప నటులు, టెక్నీషియన్స్‌తో పనిచేసే అవకాశం వచ్చినందుకు నేను చాలా సంతోష పడుతున్నా. ఈ మెమొరీస్ ఎప్పటికి గుర్తు పెట్టుకుంటాను. కానీ.. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ ఉగాది పండగ రోజు ‘విరూపాక్ష’ చిత్రంలో నా క్యారెక్టర్‌కు సంబంధించిన పోస్టర్‌ని రిలీజ్ చేస్తామని మాట ఇచ్చారు. కానీ పండుగ సందర్భంగా ఎలాంటి పోస్టర్ రిలీజ్ చేయలేదు. ఈ సంస్థ ఎందుకు ఇంత బాధ్యతారాహిత్యంగా ఉంది’’ అంటూ ఆమె మండిపడ్డారు.

దీనిపై వెంటనే స్పందించిన నిర్మాణ సంస్థ ‘‘సీనియర్స్‌గా మేము మిమ్మల్ని క్షమాపణలు కోరుతున్నాం. మీ పోస్టర్ రిలీజ్ చేసేందుకు కాస్త సమయం ఇవ్వండి’’ అంటూ ఆమెకి రిప్లై ఇచ్చారు. అయితే ఈ నటి నిజంగానే నిరాశకి గురైందా..? లేక చిత్ర యూనిట్ మాట ఇచ్చి నిలబెట్టుకోకపోవడం వల్ల ఆమెకి కోపం వచ్చిందా? లేక ఇదేమైనా ప్రమోషన్‌లో భాగమా అనేది నెటిజన్లకు క్లారిటీ రావడం లేదు. అయితే, ఈ ఈ ఇష్యూపై హీరో సాయి ధరమ్ రియాక్ట్ అవ్వలేదు.

Advertisement

Next Story