Kajal agarwal: అతని కోసం స్పెషల్‌గా రూమ్ డిజైన్ చేయించిన స్టార్ హీరోయిన్.. నెట్టింట ఫొటోలు వైరల్

by Kavitha |   ( Updated:2024-07-18 09:22:22.0  )
Kajal agarwal: అతని కోసం స్పెషల్‌గా రూమ్ డిజైన్ చేయించిన స్టార్ హీరోయిన్.. నెట్టింట ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా: ‘లక్ష్మీ కళ్యాణం’ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కాజల్ అందరికీ సుపరిచితమే. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటోంది. దాదాపు స్టార్ హీరోలందరి సరసర నటించి మంచి స్టార్‌డమ్ అందుకుంది. ఇక సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. అయితే ఈ అమ్మడు కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే కరోనా టైంలో ప్రముఖ బిజినెస్ మ్యాన్ గౌత‌మ్ కిచ్లూని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వీరికి 2022 ఏప్రిల్‌లో పండంటి బాబు జ‌న్మించాడు. కాగా ఆ బాబుకు నీల్ కిచ్లూ అనే పేరు పెట్టారు. అప్పుడప్పుడు కాజల్ తన కొడుకుతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా కాజల్ తన కొడుకు కోసం స్పెషల్‌గా రూమ్‌ని డిజైన్ చేయించింది. కాజల్ తన కొడుకు రూమ్‌లో చేయించిన స్పెషల్ డిజైన్స్‌తో ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి అలా అందంగా తయారు చేసిన వారికి థాంక్స్ చెప్తూ పోస్టు పెట్టింది. ఆ పిక్స్‌లో భాగంగా కాజల్ అగర్వాల్ కొడుక్కి సపరేట్ రూమ్ ఉండగా అందులో చిన్ని బెడ్ ఉంది. ఆ బెడ్ పై బొమ్మల షేప్ లో ఉన్న దిండ్లు, దాని పై నీల్ అని రాసి ఉన్నాయి. కూర్చోడానికి టెడ్డి బేర్ షేప్‌లో ఉన్న చిన్ని కుర్చీ ఉంది. అలాగే రూమ్ లోని గోడలన్నిటిని జంతువుల బొమ్మలతో అందంగా డిజైన్ చేయించింది. ఈ రూమ్ ఫొటోలు చూసిన నెటిజన్లు, అభిమానులు రూమ్ భలే క్యూట్‌గా ఉందని.. జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఆ ఫొటోలపై ఓ లుక్ వేసేయండి.

(photo link credits to kajal agarwal instagram id)

Advertisement

Next Story

Most Viewed