రెండో పెళ్లి చేసుకోబోతున్న నాగచైతన్య.. పెళ్లికూతురు ఆమేనంట?

by samatah |   ( Updated:2023-03-28 13:04:55.0  )
రెండో పెళ్లి చేసుకోబోతున్న నాగచైతన్య.. పెళ్లికూతురు ఆమేనంట?
X

దిశ, వెబ్‌డెస్క్ : సమంత నుంచి విడిపోయిన తర్వాత అక్కినేని నాగచైతన్యకు సంబంధించిన ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చై, శోభితా ధూళిపాళతో లవ్‌లో ఉన్నాడని, త్వరలోనే ఆమెను రెండో వివాహం చేసుకోబోతున్నాడంటూ ఎన్నో వార్తలు నెట్టింట్లో తెగ హడావిడి చేశాయి.

ఇక వీటిపై నటి శోభితా స్పందిస్తూ.. అలాంటిదేమీ లేదు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. నాగచైతన్య కూడా స్పందిస్తూ.. మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదంటూ చెప్పకొచ్చాడు. ఆ తర్వాత కొన్ని రోజులు వీరి గురించి ఎలాంటి వార్తలు రాలేదు. కాగా, తాజాగా మరోసారి నాగచైతన్య, శోభితను రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. వీరు ప్రస్తుతం డేటింగ్‌లో ఉన్నారు అంటూ మరో వార్త వైరల్ అవుతుంది. దీనికి కారణం కూడా లేకపోలేదు.తాజాగా సురేంద్ర మోహన్ ఫిబ్రవరి నెలలో నాగచైతన్యతో లండన్ లో దిగిన ఒక ఫోటోని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. అందులో వీరిద్దరి వెనక బ్యాగ్రౌండ్ లో శోభిత ధూళిపాల దర్శనమిచ్చింది. దీంతో నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. చై రెండో పెళ్లికి సమయం దగ్గర పడింది అంటూ.. నెట్టింట్లో తెగ హడావిడి చేస్తున్నారు. ఇక దీనిపై చై, శోభితా ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి : నేను ఎవరినీ అడుక్కోలేదు.. సామ్ షాకింగ్ కామెంట్స్

Advertisement

Next Story

Most Viewed