- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Anoosha Krishna: తండ్రి వయసున్న నిర్మాత ఛాన్స్ ఇస్తా వస్తావా అని అడిగాడు.. క్యాస్టింగ్ కౌచ్‌పై హీరోయిన్ సంచలన కామెంట్స్
దిశ, సినిమా: ఇండస్ట్రీలో జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే చాలామంది నటీమనులు దీనిపైనా స్పందించి తమకు ఎదురైన చెడు అనుభవాలను పంచుకున్నారు. ఇంకొందరు మాత్రం మాకు అలాంటి సంఘటనలు ఇప్పటివరకు ఏం ఎదురు కాలేదు అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఓ హీరోయిన్ కూడా క్యాస్టింగ్ కౌచ్ పై మాట్లాడుతూ నిర్మాత పై సంచలన ఆరోపణలు చేసింది. వివరాల్లోకి వెళితే..
'పేకమేడలు' మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ అనూష కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. తన మాతృ భాష కన్నడలో ఇప్పటికే రెండు సినిమాలు చేసినా అవి విడుదల కాకపోవడంతో ఇది ఆమెకు హీరోయిన్‌గా మొదటి సినిమా అని చెప్పొచ్చు. ఇక తొలి సినిమాతోనే తెలుగు నేర్చుకుని ఎంతో కాన్ఫిడెంట్‌గా మాట్లాడిన అనూష తాజాగా ఒక ఇంటర్వూలో క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన ఆరోపణలు చేసింది.
ఆమె మాట్లాడుతూ.. “నేను ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్‌తో ఇండస్ట్రీకి వచ్చానని అన్నారు. అయితే అలా ఆఫర్ల కోసం వెయిట్ చేస్తున్న సమయంలో నా తండ్రి వయసున్న ఓ నిర్మాత.. నేను చెప్పినట్లు చేస్తే మా సినిమాలో హీరోయిన్ నువ్వే అంటూ ఇబ్బంది పెట్టారని.. అతను నాతో అలా మాట్లేసరికి నాకు ఇష్టం లేదు ఆల్‌రెడీ నాకు ఎంగేజ్మెంట్ అయిందని అన్నానని.. అయినా అతను నాకు అలాంటి ఇబ్బంది ఏమీ లేదని అన్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే గంట టైం ఇస్తా నీకు నచ్చితే మా సినిమాలో నువ్వే హీరోయిన్ అని చెబితే అక్కడ ఏం చెప్పాలో తెలియక ఆ రోజు అక్కడ నుంచి బయటకు వచ్చి క్యాబ్ ఎక్కి నేను ఏడ్చిన ఏడుపు నాకు ఇంకా గుర్తుంది” అంటూ తాను అనుభవించిన బాధను పంచుకుంది.
హీరోయిన్‌గా అవకాశం రాకపోయినా నేను చదివిన చదువుకు ఏదో ఒక ఉద్యోగం చేసుకుని బ్రతకగలను. కానీ హీరోయిన్ అవ్వాలనుకుని వచ్చి మరో పని చేయటం చేతకాని ఎంతోమంది నటీమణుల పరిస్థితి ఏంటి అంటూ ఆమె ప్రశ్నించింది. ఆరోజు తన ఏడుపు విని క్యాబ్ డ్రైవర్ ఓదార్చాడని ఆమె అన్నారు. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.