ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న 28 ఏళ్ల క్రితం థియేటర్లలో రిలీజైన సినిమా.. అది ఏ మూవీ అంటే!

by Jakkula Samataha |
ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న 28 ఏళ్ల క్రితం థియేటర్లలో రిలీజైన సినిమా.. అది ఏ మూవీ అంటే!
X

దిశ, సినిమా : ఓటీటీ ప్రియులకు అదిరిపోయే న్యూస్. 28 ఏళ్ల కిందట రిలీజైన మూవీ త్వరలో ఓటీటీలో సందడి చేయనుంది. ఇంతకీ ఆ మూవీ ఏది అనుకుంటున్నారా? కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఇండియన్ మూవీ. ఈ సినిమా 1996లో రిలీజై కల్ట్ క్లాసికల్‌గా నిలిచింది. కాగా, ఈ మూవీ త్వరలో ఓటీటీలో రిలీజ్ కానుంది. జూలై15(రేపు) ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. 4 కే వెర్షన్‌లో మూవీ విడదల చేయనున్నట్లు నెటిఫ్లిక్స్ ఆఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.ఇక ఈ సినిమాలో ఊర్మిళ మండోట్కర్, మనీషా కోయిరాలా, సుకన్య హీరోయినట్లుగా నటించారు. కమలహాసన్ డ్యూయల్ రోల్‌లో నటించాడు. ఇక 15 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఆరోజుల్లో 50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిందంట. ఇక ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుండటంతో కమల్ హాసన్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోతున్నారు.

ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా ఇండియన్2 థియేటర్లలో రిలీజై నెగిటివ్ టాక్‌ సొంతం చేసుకుంది. కొన్ని చోట్ల పాజిటివ్ టాక్ వస్తే మరికొన్ని చోట్ల మాములురెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ సినిమాలో కమల్ హాసన్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, ఎస్ జే సూరయ, ప్రియా భవానీ లాంటి పలువురు నటులు కీలక పాత్ర పోషించారు.

Advertisement

Next Story

Most Viewed