పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. షాక్‌లో ఫ్యాన్స్!

by Hamsa |   ( Updated:2024-04-06 17:41:50.0  )
పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. షాక్‌లో ఫ్యాన్స్!
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఎన్నికలు ఉండటంతో రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిపోయారు. దీంతో పూర్తిగా సినిమా షూటింగ్‌లకు దూరమై సీఎం అవ్వాలని ప్రచారాలు మొదలెట్టారు. అయితే పవన్ కల్యాణ్ ఇంతకుముందే రెండు మూడు సినిమాల ప్రకటనలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒకటి. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, గ్లింప్స్ తప్ప మరే అప్డేట్ విడుదల కాలేదు. దీంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు.

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. కనీసం ఏదైనా అప్డేట్ అయినా వదలమని కొద్ది రోజుల నుంచి డైరెక్టర్‌ను వేడుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ఎన్నిసార్లు ఇలా చేసినప్పటికీ లాభం లేకపోవడంతో సైలెంట్ అయిపోయారు. ఈ క్రమంలో తాజాగా, ఉస్తాద్ భగత్ సింగ్ మేకర్స్ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ఊహించని అప్డేట్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కానీ ఏ టైమ్‌కు ఇస్తారో తెలియజేయలేదు. అయితే ఇంత సడెన్‌గా పోస్ట్ పెట్టడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అలాగే ఎలాంటి అప్డేట్ ఇస్తారా? అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Advertisement

Next Story