యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టేసిన 'పఠాన్' ట్రైలర్

by Prasanna |   ( Updated:2023-10-10 16:23:03.0  )
యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టేసిన పఠాన్ ట్రైలర్
X

దిశ, సినిమా: షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె, జాన్ అబ్రహంల నయా చిత్రం 'పఠాన్'. జనవరి 25న విడుదల కానున్న ఈ మూవీ నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. పూర్తిగా యాక్షన్ సన్నివేశాలతో కూడిన ట్రైలర్‌లో ఒక ప్రైవేట్ టెర్రరిస్ట్ గ్రూప్ ఇండియాని నాశనం చేయడానికి భారీ దాడి ప్లాన్ చేస్తుంది. అయితే ఆ పనిని జాన్ అబ్రహం తీసుకుని ఇండియన్ గవర్నమెంట్‌కు సవాల్ విసురుతాడు. దీంతో తలలు పట్టుకున్న ఇండియా అధికారులు ఒక పాత ఆఫీసర్ అయిన పఠాన్(షారుఖ్)ని రంగంలోకి దింపినట్లు తెలుస్తుండగా పఠాన్‌కు తోడుగా దీపికా కూడా ఈ ఆపరేషన్‌లో పాల్గొంటుంది. ఇక ఫైట్స్ అన్నీ గాల్లో, నీటిలో ఉన్నట్లు తెలుస్తుండగా మొత్తానికి షారుఖ్ ఈ సినిమాతో బిగ్ హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడంటూ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. చివరగా ఈ చిత్రాన్ని దేశభక్తి నేపథ్యంలోనే సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించినట్లు అర్థమవుతుండగా చివర్లో జై హింద్ నినాదంతో ట్రైలర్‌ ముగించడం విశేషం.

Advertisement

Next Story