- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Pushpa-2: సినిమాపై క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. గూస్ బంప్స్ ఖాయమంటూ
దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-2’. దీనిని సుకుమార్ తెరకెక్కిస్తుండగా.. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ అసోసియేషన్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై నవీన్, రవిశంకర్ నిర్మిస్తు్న్నారు. అయితే ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ గత కొద్ది రోజుల నుంచి వాయిదా పడుతూ వస్తుంది. దీంతో మేకర్స్ ఇటీవల డిసెంబర్ 6న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ దీనికి సంబంధించిన అప్డేట్స్ మాత్రం ఇవ్వలేదు.
దీంతో ప్రేక్షకుల్లో మళ్లీ పుష్ప-2 వాయిదా పడుతుందనే అనుమానాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో.. తాజాగా, మేకర్స్ క్రేజీ అప్డేట్ విడుదల చేశారు. ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. క్లైమాక్స్ సీన్స్ అద్భుతంగా వస్తున్నాయి. వీటిని చూస్తే అభిమానులకు పక్కా గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయి అని తెలిపారు. అలాగే ఈ సినిమా డిసెంబర్ 6న విడుదల కాబోతున్నట్లు మరోసారి క్లారిటీ ఇచ్చారు. ప్రజెంట్ ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.