- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రవితేజ బర్త్‌డే సందర్భంగా స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్న ‘ఈగల్’ టీం.. పోస్ట్ వైరల్
దిశ, సినిమా: మాస్ మహారాజ, కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘ఈగల్’. సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన ఈ మూవీ థియేటర్ల కొరతతో ఫిబ్రవరి 9 కి పోస్ట్ పోన్ అయింది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబోట్ల నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో కావ్య తాపర్ హీరోయిన్ కాగా.. అనుపమ పరమేశ్వరన్, నవదీప్, వినయ్ రాయ్‌లు ప్రదాన పాత్రల్లో కనిపించనున్నారు.
ఇదిలా ఉంటే.. ఈనెల 26న రవితేజ బర్త్‌డే సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్పెషల్ ట్రీట్ ఇవ్వనుంది. ఈ మేరకు ‘మహమూద్ హౌస్ గ్రాండ్ గార్డెన్, యూసఫ్ గుడాలో రవితేజ పుట్టిన రోజు వేడుకలు గ్రాండ్‌గా జరగబోతున్నట్లు’ సోషల్ మీడియా వేదికగా స్పెషల్ పోస్ట్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. రవితేజ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.