యాక్టింగ్ రాకపోయినా అమలను సెలక్ట్ చేసిన డైరెక్టర్.. అందానికి పడిపోయాడా?

by Anjali |   ( Updated:2023-10-17 04:55:46.0  )
యాక్టింగ్ రాకపోయినా అమలను సెలక్ట్ చేసిన డైరెక్టర్.. అందానికి పడిపోయాడా?
X

దిశ, వెబ్‌డెస్క్: హీరో అక్కినేని నాగార్జున భార్య అమల గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన అక్కర్లేదు. వీరిద్దరు కలిసి పలు సినిమాల్లో నటించిన అనంతరం ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. అయితే, తాజాగా అమల గురించి నెట్టింట ఓ వార్త హల్ చల్ చేస్తోంది. 1987లో సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్పకవిమానం’ చిత్రంలో కమల్ హాసన్ సరసన అమల నటించింది. అయితే, అమల కంటే ముందే ఈ చిత్రంలో ‘నీలమ్ కొఠారి’ అనే ముంబయి హీరోయిన్‌ను తీసుకుందామని అనుకున్నారట. షూటింగ్‌కు ముదు నీలమ్ కొన్ని కండిషన్స్ పెట్టడంతో దర్శకుడు నో చెప్పి ఆమెను వద్దన్నారట. తర్వాత మాధురీ దీక్షిత్‌ను సంప్రదించగా.. ఇలాంటి స్టోరీస్ నాకు నచ్చవని ముఖం మీదనే చెప్పిందట. కొన్ని రోజుల తర్వాత సన్మాన వేడుకలో అమలను చూసిన డైరెక్టర్ చాలా బాగుంది. నాచురల్‌గా ఉందని ఆ మూవీలో ఆమెను సెలెక్ట్ చేశారట. కొంతమంది అమలకు నటన రాదని చెప్పినా కూడా సింగీతం శ్రీనివాస్ అవన్నీ పట్టించుకోకుండా అమలను ఆ చిత్రంలో తీసుకున్నారట.

Advertisement

Next Story