- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ డైరెక్టర్ నన్ను ఒంటరిగా రమ్మన్నాడు: కాస్టింగ్ కౌచ్‌పై ఆమని
దిశ, సినిమా : ప్రముఖ సీనియర్ నటి ఆమని కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అంటోంది. గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి పలువురు నటీమణులు సంచలన విషయాలు బయటపెట్టిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఆమని సైతం దీనిపై ఓపెన్ అయింది. 'ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే హీరోయిన్లు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నా సక్సెస్ వెనక ఎన్నో కష్టాలున్నాయి. చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నా. ఆడిషన్స్ కోసం వెళ్తే తర్వాత కబురు పంపిస్తామనేవాళ్లు. ఓ వారం తర్వాత 'మేడమ్ డైరెక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు' అని ఎవరో ఒకరు వచ్చి చెప్పేవాళ్లు. ఎందుకంటే మేకప్ టెస్ట్ అనేవాళ్లు. ఒంటరిగానే రావాలని పట్టుపట్టేవారు. నాకు పోను పోను అర్థమైంది. అడ్డదారిలో సినిమాల్లోకి రావడం నాకు అస్సలు నచ్చదు. అందుకే నేను ఎంట్రీ ఇచ్చేందుకు దాదాపు రెండేళ్ల సమయం పట్టింది' అంటూ గతాన్ని గుర్తుచేసుకుంది.