మళ్లీ మళ్లీ తనతో అలా చేసే రోజు రావాలి.. పవన్ కళ్యాణ్ పై ఘాటు కామెంట్స్ చేసిన అషు రెడ్డి..!!

by Kavitha |   ( Updated:2024-05-27 16:26:37.0  )
మళ్లీ మళ్లీ తనతో అలా చేసే రోజు రావాలి.. పవన్ కళ్యాణ్ పై ఘాటు కామెంట్స్ చేసిన అషు రెడ్డి..!!
X

దిశ, సినిమా: జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అందాల భామ అషు.. ప్రజెంట్ సూపర్ క్రేజ్‌తో దూసుకుపోతుంది. సోషల్ మీడియాలో బాగా క్లిక్ అయిన ఈ బ్యూటీ.. తర్వాత బుల్లితెరపై పలు షోలు చేస్తూ పాపులారిటీ పెంచుకుంది. ముఖ్యంగా ఆర్జీవి ఇంటర్వ్యూతో కుర్రాళ్లకు గుర్తిండి పోయేలా మారిపోయిన అషు.. బిగ్ బాస్ సీజన్ 3 లో ఎంట్రీ ఇచ్చి అందరినీ తన అందంతో ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం వెండితెరపై కూడా అడుగు పెట్టేందుకు రెడీ అయినా ఈ అమ్మడు.. ‘యేవమ్’ అనే క్రేజీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది.

అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పవన్ కళ్యాణ్ పై ఘాటుగా కామెంట్స్ చేసింది. అది ఇప్పుడు వైరల్‌గా మారింది. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సమయంలోనే అషు రెడ్డి తాను పవన్ కల్యాణ్‌కు వీరాభిమానిని అని చెప్పిన విషయం తెలిసినదే. అంతేకాదు, ఆయన పేరును ప్రైవేటు ప్లేస్‌లో టాటూగా వేయించుకున్నట్లు ఓ ఫోటోను కూడా షేర్ చేశారు ఆమె స్నేహితులు. అయితే ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ 'ఉదయం లేచే సరికి నీ బెడ్‌రూంలో పవన్ కల్యాణ్ ఉంటే ఏం చేస్తావ్' అని ఆమెను అడగగా దానికి అషు రెడ్డి 'అదే జరిగితే.. ఆరోజు అస్సలు పూర్తి కాకూడదు అనుకుంటా. మళ్లీ మళ్లీ అలాంటి రోజే రావాలని దేవుడిని కోరుకుంటా' అంటూ నాటీ గా సమాధానం చెప్పింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.



Read More...

వెకేషన్‌ ట్రిప్‌లో వేడి పుట్టిస్తున్న మౌని రాయ్.. ఎంజాయ్ మామూలుగా లేదుగా..

Advertisement

Next Story