బ్యాంకు వాళ్లు నా ఇల్లు జప్తు చేశారు : దర్శకుడు తేజ

by Dishaweb |   ( Updated:2023-05-22 10:38:37.0  )
బ్యాంకు వాళ్లు నా ఇల్లు జప్తు చేశారు : దర్శకుడు తేజ
X

దిశ, సినిమా: దర్శకుడు తేజ గురించి పరిచయం అక్కర్లేదు. అతని ఖాతాలో చాలా సక్సెస్ ఫుల్ స్టోరీస్ ఉన్నాయి. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే తేజ ముక్కుసూటి మనిషి. ఎంతటి వారికైనా అవలీలగా సమాధానం ఇచ్చేస్తాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు. ‘నాకు జరిగిన అవమానం, చేసిన తప్పులు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. ఒకసారి ఇంటిపై లోన్‌ తీసుకున్నాను. ఓ నాలుగు సంవత్సరాలు సినిమాలు చేయలేదు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో బ్యాంక్‌ వాళ్లు ఇంటిని జప్తు చేస్తున్నట్లు, ఇంటి గోడకు నోటీసు రాసి పెట్టారు. కొద్ది రోజులకు బ్యాంక్‌‌కు డబ్బులు మొత్తం చెల్లించాను. ఇక జీవితంలో లోన్ జోలికి పోకూడదని ఫిక్స్ అయ్యాను. అందుకే నాలో ఆ భయం అలాగే ఉండటం కొరకు వాళ్ళు రాసిన నోటీసు గోడకు అలాగే ఉంచాను’ అంటూ చెప్పుకొచ్చాడు తేజ.

Read More: కాలు విరిగినా బెడ్‌పై రెచ్చిపోయిన రోహిణి.. ఆ ఇద్దరితో కలిసి..! వీడియో వైరల్

Advertisement

Next Story

Most Viewed