ఆ చానల్ ఇప్పటివరకు నాకు క్షమాపణలు చెప్పలేదు: పూనమ్ కౌర్

by Hamsa |
ఆ చానల్ ఇప్పటివరకు నాకు క్షమాపణలు చెప్పలేదు: పూనమ్ కౌర్
X

దిశ, సినిమా: ఒకప్పటి టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు గత కొద్ది కాలంగా సినిమాలకు దూరం అయింది. కానీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు వివదాస్పద పోస్టులతో వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్, త్రివిక్రమ్‌లపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెడుతుంది.

అయితే దిశ ఘటన సమయంలో ఆమె ట్వీట్ వేసినట్లు ఓ చానల్ పేపర్‌లో వేసింది. అంతేకాకుండా పూనమ్ ఫొటోను కూడా అందులో వేశారు. అసలు అందులో ఏముందంటే.. దిశకు న్యాయం చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు థ్యాంక్స్, అలాగే నాతో పాటు పలువురు మహిళలను మోసం చేసిన కొంతమంది సినీ అలియాస్ రాజకీయ నాయకులను శిక్షిస్తారని భావిస్తున్నాను. ప్లీజ్ రెండు బెత్తం దెబ్బలు అని రాసి ఉంది.

తాజాగా, ఈ వార్తపై పూనమ్ ట్విట్టర్ వేదికగా స్పందించి క్లారిటీ ఇచ్చింది. ‘‘నాపై మరో ఫేక్ న్యూస్ వచ్చింది. దీనిపై ఇప్పటి వరకు మీడియా హౌస్ ఎలాంటి క్షమాపణలు చెప్పలేదు. అలాగే నాకు క్లారిటీ కూడా ఇవ్వలేదు. బహుశా ఒకరి ఎజెండాను మరొకరి భుజంపై రుద్దడం అంటే ఇదే కావచ్చు. వారు నాకు క్లారిటీ ఇస్తారని నాకు ఎటువంటి ఆశలు లేవు. కానీ ఆ వార్త నమ్మొద్దని నేను ప్రజలకు గుర్తు చేయడంతో పాటుగా అభ్యర్థిస్తున్నాను. కానీ వారు నన్ను ఇప్పటివరకు వెంటాడుతున్నారు’’ అని రాసుకొచ్చింది. ప్రజెంట్ పూనమ్ కౌర్ ట్వీట్ నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. ఇన్నాళ్లకు క్లారిటీ ఇవ్వడానికి కారణం ఏంటని.. నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed