- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో తెలుగు వారియర్స్ తొలి విజయం
by GSrikanth |

X
దిశ, వెబ్‌డెస్క్: సెలబ్రిటీ క్రికెట్ లీగ్(CCL)లో తెలుగు వారియర్స్ తొలి విజయం నమోదు చేశారు. శనివారం మధ్యాహ్నం దుబాయ్‌లోని షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో భోజ్‌పురి దబాంగ్స్‌పై తెలుగు వారియర్స్ జట్టు ఘన విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకున్నది. ఈ మ్యాచ్‌లో కీలక ప్రతిభ చాటిన నటుడు అశ్విన్‌ను మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. కాగా, ఈ టోర్నమెంట్‌లో తెలుగు వారియర్స్ ఇప్పటివరకు నాలుగుసార్లు విజేతగా నిలిచి ట్రోఫీ లిస్టులో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు. గతేడాది సీజన్‌లో కూడా తెలుగు హీరోలే విజేతలుగా నిలిచారు. తెలుగు వారియర్స్‌కి అక్కినేని అఖిల్ కెప్టెన్ చేస్తుంటే సచిన్ జోషి యజమానిగా వ్యవహరిస్తున్నారు.
Next Story