చైతూ-శోభితల విడాకుల జ్యోతిష్యం ఎఫెక్ట్.. డెడ్‌లైన్ విధించిన రాష్ట్ర మహిళా కమిషన్

by Gantepaka Srikanth |
చైతూ-శోభితల విడాకుల జ్యోతిష్యం ఎఫెక్ట్.. డెడ్‌లైన్ విధించిన రాష్ట్ర మహిళా కమిషన్
X

దిశ, వెబ్‌డెస్క్: నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియా ట్రెండింగ్‌లో ఉంటున్న ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ షాకిచ్చింది. మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఈనెల 22న మహిళా కమిషన్‌ ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఇటీవల గ్రాండ్‌గా ఎంగేజ్‌‌మెంట్ చేసుకున్న అక్కినేని హీరో నాగచైతన్య, ప్రముఖ హీరోయిన్ ధూళిపాళ శోభిత విడిపోతారంటూ వారి పెళ్లి కాకముందే వేణుస్వామి చెప్పిన జ్యోతిష్యంపై నోటీసులు ఇచ్చారు.

కాగా, చైతూ-శోభితల జాతకం ప్రకారం వీరిద్దరు ఎక్కువగా కాలం కలిసి ఉండరని, ఓ అమ్మాయి కారణంగా ఈ జంట విడిపోతుందని. అది కూడా 2027లో విడాకులు అవుతాయంటూ సంచలన వేణుస్వామి వ్యాఖ్యలు చేశారు. ఈ స్టేట్‌మెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలుగు ఫిల్మ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌, తెలుగు ఫిల్మ్‌ డిజిటల్‌ మీడియా అసోసియేషన్‌ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశాయి. వేణుస్వామిపై చర్యలు తీసుకోవాలంటూ రిక్వెస్ట్ చేశాయి. ఈ ఫిర్యాదుకు స్పందించిన మహిళా కమిషన్‌కు వేణుస్వామికి నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. తన భర్తకు సపోర్ట్ చేస్తూ వేణుస్వామి భార్య వాణి సైతం వీడియో రిలీజ్‌ చేసింది. ఈ సందర్భంగా టాలీవుడ్ మీడియాపై వాణి ఆగ్రహం వ్యక్తం చేసింది.

Advertisement

Next Story