Taapsee Pannu: తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వనున్న ప్రభాస్ హీరోయిన్.. ఆ హారర్ మూవీకి స్వీకెల్‌లో!

by sudharani |
Taapsee Pannu: తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వనున్న ప్రభాస్ హీరోయిన్.. ఆ హారర్ మూవీకి స్వీకెల్‌లో!
X

దిశ, సినిమా: డార్లింగ్ ప్రభాస్ ‘Mr. పర్‌ఫెక్ట్’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ పన్ను.. తర్వాత బాలీవుడ్ చెక్కేసింది. ప్రజెంట్ అక్కడ వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. త్వరలోనే మళ్లీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఓ సినిమా చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని సమాచారం. అది కూడా గతంలో చేసిన తెలుగు సినిమాకు సీక్వెల్‌గా ఈ మూవీ రాబోతున్నట్లు టాక్. తాప్సీ.. తెలుగులో నటించిన చిత్రాల్లో ‘ఆనందో బ్రహ్మా’ ఒకటి.

హారర్ అండ్ థ్రిల్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రానికి సీక్వెల్‌ చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. యాత్ర, యాత్ర-2 వంటి పొలిటికల్‌ డ్రామ సినిమాలను తెరకెక్కించిన మహి.వి.రాఘవ ‘ఆనందో బ్రహ్మా’ చిత్రానికి దర్శకత్వం వహించిని విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అదే దర్శకుడు ‘ఆనందో బ్రహ్మా-2’ మూవీని తెరకెక్కించే పనిలో ఉన్నారని టాక్. అంతే కాకుండా.. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్‌ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

Advertisement

Next Story