దయచేసి మనుషుల్లా ప్రవర్తించండి.. నా వేషధారణపై అవన్నీ ఆపేయండి.. : అనసూయ ఫైర్

by Hamsa |   ( Updated:2023-06-19 10:53:41.0  )
దయచేసి మనుషుల్లా ప్రవర్తించండి.. నా వేషధారణపై అవన్నీ ఆపేయండి.. : అనసూయ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. యాంకర్‌గానే కాకుండా పలు చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఒకప్పుడు తనను ఆంటీ అన్న వారిపై కేసు పెట్టి దుమారం రేపింది. ఇటీవల సోషల్ మీడియాలో బికినీ ఫొటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది. దీంతో ఆమె డ్రెస్సింగ్‌ను కొంత మంది తప్పుపట్టగా.. మరి కొంత మంది అందాన్ని పొగిడారు.

తాజాగా, మరోసారి సోషల్ మీడియాలో అనసూయ తన వేషధారణపై వస్తున్న కామెంట్స్‌కు వరుస ట్వీట్స్‌తో ఫైర్ అయింది. ‘‘ అందరికీ నమస్కారం. నేను చేయవలసిన అభ్యర్థన ఉంది. కొన్ని రోజుల నుండి నాకు చాలా ట్వీట్లు వస్తున్నాయి. రాజకీయ, సినీ పరిశ్రమ వర్గాల్లో ఇతరులను అగౌరవ పరిచేందుకు నా పేరును వాడుతున్నారు. ఇది నాకు చాలా ఇబ్బందికరంగా, అగౌరవంగా ఉంది. నా పేరు కించపరిచే స్థాయిలో ఉంది. కాబట్టి ఈ విషయంపై నోరు విప్పక తప్పట్లేదు. నా జీవితాన్ని నాకు మాత్రమే నచ్చిన విధంగా నడిపించుకోవటానికి ప్రయత్నిస్తున్నాను. నేను ఎవరి దారిలోకి రావడం లేదు. అనవసర విషయాలతో నాకు ఎక్కడా సంబంధం లేదు. అలా సంబంధం లేని చోట నా పేరును వాడటం నాకు అనవసరమైన బాధను కలిగిస్తుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే.. ఇండస్ట్రీలో నేను కా కాళ్ల మీద నిలబడుతున్నాను. వచ్చిన, నచ్చిన రోల్స్‌లో నటిస్తున్నాను. నాకు ఎటువంటి PR, మరి ఇంకెవరో లేరు. గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నాను. కాబట్టి నా వేషధారణ ఆయా సందర్భాన్ని బట్టి ఉంటుంది. మీరు ఎంకరేజ్ చేస్తే చేయండి. లేదంటే కనీసం నా నుండి దూరంగా ఉండండి. దయచేసి నా పేరును అనవసర విషయాల్లో లాగొద్దు. అలా లాగకుండా ఉండేందుకు తగినంత దయతో కాస్త మనుషుల్లా ప్రవర్తించండి. నాకు ఓ కుటుంబం ఉంది. దయచేసి ఇవన్నీ ఆపేయండి’’ అంటూ వరుస ట్వీట్స్ చేసింది.

Advertisement

Next Story